టాలీవుడ్ నాట విషాదం… కమెడియన్ సూసైడ్..!

Comedian Vijay Sai Suicideమీకు ‘అమ్మాయిలు అబ్బాయిలు’ సినిమా గుర్తుందా? ఛాతీ చుట్టూ మాత్రమే వెంట్రుకలు కనిపించే క్యారెక్టర్ లో నటించిన నటుడు… ‘బొమ్మరిల్లులో ‘పిచ్చెక్కిస్తా’ అని డైలాగులు చెప్పిన క్యారెక్టర్ గుర్తుందా? అతనే విజయ్. యువ నటుడిగా అవకాశాలు వచ్చినా, గుర్తుండి పోయే క్యారెక్టర్లు చేసినా, సరైన అవకాశాలు రాక, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన విజయ్, ఈ ఉదయం ఆత్మహత్య చేసుకోగా, టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.

తన స్నేహితులతో కలసి అపార్టుమెంటులో ఉంటున్న విజయ్, ఎవరూ లేని సమయంలో తన జీవితాన్ని చాలించాడు. సినిమా అవకాశాలు తగ్గిపోవడం, చేతిలో పనిలేక పూట గడవని స్థితిలోనే ఆయన ఈ పనికి పాల్పడినట్టు తెలుస్తోంది. విజయ్ మృతి గురించి తెలుసుకున్న ఇందిరానగర్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని పలువురు జూనియర్ ఆర్టిస్టులు, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

మంచి టైమింగ్ ఉన్న నటుడిగా విజయ్ గుర్తుండిపోయే పాత్రలు చేశాడనే చెప్పచ్చు. తొలి చిత్రంతో హిట్ కొట్టినా, ఆపై చేసింది చిన్న సినిమాలు కావడం, అవి కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో విజయ్ ఇబ్బందుల్లో పడ్డాడని తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం గత కొంతకాలంగా విజయ్, ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరుగుతున్నాడని సన్నిహితులు వెల్లడించారు.

ADVERTISEMENT
Latest Stories