రాహుల్ గాంధీ తెలంగాణలో సొంత పార్టీనే ఓడించుకోబోతున్నారా?

Congress-Party-Rahul-Gandhi-Bharat-Jodo-Yatra-Andhra-Pradeshదేశ రాజకీయాలలో నిత్యం వినిపించే పేరే కానీ దేశ రాజకీయాలలో అత్యంత నిరాసక్తమైన పేరది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?అంటే రాహుల్ గాంధీ అని చెప్పుకోవచ్చు.

రాజకీయాలలో ఆ స్థాయికి ఎదిగి అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. కానీ ఆయన నెహ్రూ కుటుంబంలో పుట్టినందున అన్నీ వారసత్వంగా వచ్చేశాయి. అయితే రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లోపించడంతో కాంగ్రెస్‌ పగ్గాలను వేరేవారికి అప్పగించడానికి సిద్దపడి ఆయన ‘భారత్‌ జోడో’ అంటూ కాళ్ళు, జోళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నారు.

ADVERTISEMENT

నేడు ఆయన కర్నాటకలో నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లా, ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్విలో అడుగుపెట్టారు. ఈ నెల 21వరకు ఏపీలో ఆయన పాదయాత్ర సాగుతుంది. ఏపీలో ఆలూరు, అధోని, ఎమ్మిగూడెం, మంత్రాలయం మీదుగా మళ్ళీ కర్నాటకలో ప్రవేశించి అక్కడి నుంచి తెలంగాణలో ప్రవేశిస్తారు.

అయితే రాహుల్ గాంధీ ఏపీలో మోకాలి యాత్ర చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి రాలేదనే విషయం ఆ పార్టీలో మిగిలిన కాంగ్రెస్‌ నాయకులందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు.

తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రవేశిస్తారు. కనుక తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిని ఓ సారి సమీక్షించుకొంటే, ఏపీని, ఏపీ కాంగ్రెస్ పార్టీని కూడా పణంగా పెట్టి తెలంగాణ ఏర్పాటు చేసినప్పటికీ ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోతోంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బిజెపి బలపడటంతో అక్కడా ఇపట్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.

నవంబర్‌ 3వ తేదీన నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కనుక సరిగ్గా ఇటువంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేయబోతున్నారు. కనుక ఆయన వలన కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలుగుతుందని ఆశించడం సహజం. కానీ ఆయన మునుగోడులో అడుగుపెట్టకుండా ఆ పక్క నుంచే వెళ్ళిపోనున్నారు!

రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ ఆయన వెంట నడవక తప్పదు. మునుగోడు ఉపఎన్నికలు దగ్గర పడుతుంటే ప్రచారంలో పాల్గొనవలసిన సీనియర్ నేతలందరూ ఆయన వెంట వెళ్లిపోతే మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్ధికి డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అంటే రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా తెలంగాణలో సొంత పార్టీకే నష్టం కలిగించుకోబోతున్నారన్న మాట!

ఓ పార్టీకి, దేశానికి నాయకత్వం వహించాలనుకొనే వ్యక్తికి వాటిని గెలిపించుకొనే లక్షణాలు కలిగి ఉండాలి. కానీ రాహుల్ గాంధీ పాదయాత్రతో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి కొత్తగా ఒరిగేదేమి ఉండదు. ఓకే! కానీ తెలంగాణలో మనుగడ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆయనే ఓడించుకోబోతున్నారన్న మాట! నవంబర్‌ 6వ తేదీన మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనే వార్త విన్న తర్వాత నవంబర్‌ 7వ తేదీన రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ప్రవేశిస్తారు!

ADVERTISEMENT
Latest Stories