స్థానిక పరీక్షకు టీడీపి రెడీ.. వైసీపీ రెడీయేనా?

AP Local Elections

ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారు చేశారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ ముగిన వెంటనే సెప్టెంబర్‌ నెలాఖరులోగా లేదా అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు పెద్ద కష్టం కాదు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ వైసీపీ అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నప్పుడు మరింత తేలికవుతుంది.

ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలు, రాజకీయాలు, మావిగన్‌తో ఉత్తరాంధ్ర జిల్లాలకు హ్యాండ్ ఇవ్వడం, రాయలసీమలో జోరుగా సాగుతున్న పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుతున్న మాటలు వైసీపీకి శాపాలుగా, కూటమి పార్టీలకు కలిసి వచ్చే అంశాలే.

ADVERTISEMENT

అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడు కూడా కూటమి పార్టీల నేతలకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధికి, రాజధాని అమరావతి అభివృద్ధికి వైసీపీ నేతలు ఏవిధంగా అడుగడుగున్నా అడ్డుపడుతున్నారో ప్రజలకు వివరించి చైతన్యపరచాలని సూచించారు.

రాయలసీమ, అమరావతి, ఉత్తరాంధ్రా మూడు ప్రాంతాలకు సంబందించిన అంశాలపై కూటమి ప్రభుత్వం వైఖరి, వైసీపీ వైఖరి ఏవిధంగా ఉందో ప్రజలకు వివరించాలని సూచించారు. కులమతాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజల మద్య చిచ్చు రగిలించేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎండగట్టాలని నేతలకు సిఎం సూచించారు.

కూటమి ప్రభుత్వం గురించి ప్రజలలో సదాభిప్రాయమే ఉన్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేల వలన చెడ్డపేరు వస్తోందని అటువంటివారికి ఆగస్టులో రెండు రోజులు క్లాసు తీసుకుంటానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోబోతోందో సిఎం చంద్రబాబు నాయుడు మాటలతో స్పష్టమైంది. మరి వైసీపీ ఏవిధంగా ఎదుర్కోబోతోంది? దాని అధినేత జగన్మోహన్ రెడ్డి వద్ద ఏమైనా ప్లాన్ ఉందా? లేక ప్రశ్న రావణ్ వంటి కేసులతోనే ఎదుర్కొంటారా? చూడాలి.

దీనిలో ఎదురుదెబ్బ తగిలితే అది అమరావతితో సహా ఏపీకి సంబంధించి వైసీపీ వైఖరికి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పుగానే పరిగణించబడుతుంది. కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి మరో అగ్నిపరీక్ష వంటివే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories