తెలంగాణాలోని సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మహేష్ స్వయంగా ఈ పనులను చూసుకోనప్పటికీ, సతీమణి నమ్రత ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తన టీంతో కలిసి సిద్దాపురంలో చేస్తోన్న పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.
ADVERTISEMENT
[m9ad]
ఈ క్రమంలో తాజాగా విద్యార్ధులకు ఓ తీపికబురును అందించారు. వచ్చే ఏడాదికి పాఠశాల నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్కూల్ లో విధులు కూడా జరుగుతాయని చెప్తూ… పాఠశాల నిర్మాణానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేసారు. ఇంత బాగా పనిచేస్తున్నందుకు ఈ సందర్భంగా తన టీంకు కృతజ్ఞతలు తెలిపారు నమ్రత.
ADVERTISEMENT



