కనుకొట్టిన చిన్నదానితో సీపీఐ పోస్టర్!

Priya Prakash Varrier on CPI AISF Posterఒక్క కనుగీటుతో కోట్లాది మంది యువకుల గుండెల్లో గుబులు పుట్టించిన ప్రియా ప్రకాశ్ వారియర్, ఇప్పుడు సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) పోస్టర్లపైకి ఎక్కింది. తన హావభావాలతో సోషల్ మీడియాను షేక్ చేసి, ఎంతో మంది హీరోలను, క్రీడాకారులను ఫిదా చేసిన ప్రియా ప్రకాశ్ కనుగీటుతున్న ఫోటోను సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తమ మహాసభల పోస్టర్‌ లో చేర్చింది.

ADVERTISEMENT

మహాసభల సందర్భంగా విడుదల చేసిన ఆహ్వాన పోస్టర్ లో కేవలం ప్రియ చిత్రం ఒక్కటే ఉండటం గమనార్హం. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ వివాదాల్లో చిక్కుకుని ఇంకా వెండి తెరను తాకలేదన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రియా ప్రకాశ్ కు, చిత్ర యూనిట్ కు తమ మద్దతు తెలిపేందుకే ఆమె ఫోటోను పోస్టర్ లో చేర్చినట్టు కేరళ ఏఐఎస్ఎఫ్ సంయుక్త కార్యదర్శి జంషీర్‌ తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories