మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసే వాడు మా వాడైనా పరాయి వాడే..మాతో నిలబడే వాడు పరాయి వాడైనా మా వాడే అంటూ నాగబాబు తన సోషల్ మీడియా వేదిక గా ఒక ట్వీట్ పెట్టారు. అయితే నాగబాబు పెట్టిన ఈ ట్వీట్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే అంటూ సోషల్ మీడియాలో ఈ ట్వీట్ పై మెగా ఫాన్స్ vs అల్లు ఆర్మీ పేరుతో చర్చలు, డిబేట్లు కొనసాగుతున్నాయి.
అసలీ చర్చకంతటికి మూలాధారమైన వైసీపీ అల్లు అర్జున్ మీద వల్లామాలిన ప్రేమ వలక పోస్తూ మెగా కుటుంబంలో విభేదాలకు అగ్గి రాజేస్తోంది. ఇందులో భాగంగానే స్పందించిన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్రా రెడ్డి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారో కానీ అవి బన్నీ ని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది ఆయన సంస్కారానికి వదిలేస్తా అన్నారు. స్నేహితుల కోసం నిలబడ్డాను అంటూ బన్నీ వివరణ ఇచ్చినప్పటికీ ఇటువంటి విమర్శలు చేయడం నాగబాబుకు సబబు కాదన్నారు.
Also Read – అప్పుడు బిఆర్ఎస్ మౌనం… ఇప్పుడు టిడిపి!
అయితే తమ్ముడు కోసం అన్న నిలబడితే తప్పుబట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు స్నేహితుడి కోసం మద్దతు తెలిపితే తప్పా..? అంటూ ఎదురు ప్రశ్నించడం మాత్రం వైసీపీ సంస్కారానికి నిదర్శనమనే చెప్పాలి. పిఠాపురం ప్రజలను ఉద్దేశించి పవన్ గెలుపు కోసం మెగా స్టార్ ఒక వీడియో బైట్ విడుదల చేయడాన్ని సైతం తప్పుబట్టిన వైసీపీ నేత పోసాని వ్యాఖ్యలు మరిచి ఇప్పుడు సంస్కారం అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు కూటమి నేతలు.
అలాగే తన మిత్రుడైన చంద్రబాబు గురించి, ఆయన విజనరీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను సైతం వదలని ఈ వైసీపీ నేతలు ఇప్పుడు బన్నీ మీద ప్రేమ కురిపించడం అంటే అది కుటుంబాల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుంది. టీడీపీ పార్టీని చంద్రబాబు ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తానూ ఎప్పటికి తన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీకి బద్ధుడై ఉంటానని జూ. ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఆయన పేరును తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ జూ. ఎన్టీఆర్ మీద కూడా ఇదే తరహా ప్రేమ నటిస్తారు వైసీపీ నేతలు.
Also Read – చిన్న సిట్ వద్దనుకుంటే పెద్ద సిట్… ఇప్పుడెలా?
ఇందులో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ జూ. ఎన్టీఆర్ తో తమకున్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా చేసుకుని అవసరం లేని చోట కూడా పదేపదే జూ. ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చి లోకేష్ మీద బాబు మీద విమర్శలు చేస్తుంటారు. మరి అప్పుడు ఈ సంస్కారాన్ని ఏ లాకర్ లో పెట్టి తాళమేస్తారో వైసీపీ నేతలు. ఇలా తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టడం వారిని అడ్డుపెట్టుకుని వారి కుటుంబాల మీదే మాటల దాడిని కొనసాగించడం వైసీపీ సంస్కారంలో భాగంగానే చెప్పాలి.