బాహుబలితో తన స్థాయిని, పరిధిని పెంచుకున్న తెలుగు సినిమా RRR తో ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకుంది. తాజాగా విడుదలైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో భాగంగా తెలుగు సినిమా తన హవా కొనసాగించింది.
ఈ అవార్డులో 2024 లో ”బెస్ట్ ఫిలిం అఫ్ ది ఇయర్” గా ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ నిలిచింది. కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద తన వసూళ్ల వేట కొనసాగించి ప్రభాస్ స్టామినా మరోసారి నిరూపించింది.
ప్రభాస్, పృథ్వి రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సలార్ మూవీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్నేహన్నిఆవిష్కరించి ప్రేక్షకులను కట్టిపడేస్తే, ఆస్నేహమే వైరంగా ఎలా మారుతుందో అనే ఉత్కంఠతో సలార్ పార్ట్ 2 తెరకెక్కనుందని సమాచారం.
అలాగే నాన్న నాన్న…వినిపిస్తుందా…అంటూ థియేటర్లలో యానిమల్ సౌండ్ బాగా గట్టిగా కొట్టారు దర్శకుడు సందీప్. ఈ సినిమాకు సంబంధించి బెస్ట్ డైరెక్టర్ గా సందీప్, బెస్ట్ నెగటివ్ రోల్ గా బాబీడియోల్, బెస్ట్ సపోర్టివ్ యాక్టర్ గా అనిల్ కపూర్ ఎంపికయ్యారు. యానిమల్ తో రణబీర్ కపూర్ తో పాటు బాలీవుడ్ యాక్టర్స్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసారు సందీప్ వంగా.
అయితే యానిమల్ మూవీ తో సందీప్ ఎన్నో వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ఇప్పుడు అవార్డులు కూడా దక్కించుకోవడం ఆయన అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్త. అలాగే బెస్ట్ ఫిల్మ్ గా జవాన్, ఆ చిత్రంలో నటించిన షారుక్ ఖాన్..బెస్ట్ యాక్టర్ గా, నయనతార మోస్ట్ వెర్సటైల్ యాక్టర్స్ గా, అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నాలుగు కేటగిరీలలో అవార్డులను సొంతం చేసుకుంది జవాన్ చిత్రం.




