బీసీ కబుర్లతో కాలక్షేపం చేయలే.. దళవాయితో ఎంపికతో చేసి చూపారు

Dalavai Ramadevi: TDP's Focus on BC Political Representation

తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, పదవుల కోసం లాబీయింగ్, సిఫార్సులు అవసరం లేదని దళవాయి రామదేవి ఎంపిక మరోసారి స్పష్టం చేస్తోంది. సిఎం చంద్రబాబు నాయుడు ఏనాడూ నా బీసీలు, నా ఎస్సీ, ఎస్టీలు అంటూ దీర్గాలు తీయరు. కానీ వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ నిబద్దత చాటుకుంటారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారిని గుర్తించి, సముచిత గౌరవం, తగిన అవకాశాలు కల్పిస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రామదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే.

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న బీసీ మహిళా నాయకురాలు ఆమె. డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా, టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆమెకు ఈ పదవికి ఎంపిక చేయడం ద్వారా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను నాయకత్వం తప్పక గుర్తిస్తుందనే సందేశం పంపినట్లయింది.

ADVERTISEMENT

మన రాష్ట్రంలో, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా అధికార, ప్రతిపక్షాలు ‘బీసీ సంక్షేమం’ అంటూ ఏవో మాట్లాడుతూనే ఉంటాయి. కానీ సిఎం చంద్రబాబు నాయుడు అలాంటి ఊక దంపుడు ఉపన్యాసాలు ఏవీ ఇవ్వకుండానే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషనలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. తద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి మరింత అవకాశం కల్పించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒకవైపు 34 శాతం బీసీ రిజర్వేషన్, మరోవైపు బీసీ మహిళా నాయకురాలైన దళవాయి రామదేవికి ఎమ్మెల్సీ అవకాశం.. బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి.

అదే సమయంలో సీనియర్ టీడీపీ నేత, దళిత నాయకుడు వర్ల రామయ్యకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా దళిత నాయకత్వానికి కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించింది.

దళవాయి రామదేవి, వర్ల రామయ్యల ఎంపికలు.. సామాజిక ప్రాతినిధ్యంతో పాటు పార్టీ కోసం పనిచేసిన వారి సేవలకు గుర్తింపు ఇచ్చే టీడీపీ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. టీడీపీలో లాబీయింగ్ కంటే కష్టానికి విలువ.. బీసీల విషయంలో మాటల కంటే నిర్ణయాలకే ప్రాధాన్యత అని మరోసారి స్పష్టమైంది.

ADVERTISEMENT
Latest Stories