రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ఫ్లాట్లను అప్పగించే విషయమే ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసింది. దీంతో ఎప్పుడు తమకు ఫ్లాట్లు సొంతమవుతాయో అన్న ఆసక్తి రైతులలో వ్యక్తమవుతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి నారాయణ ఒక ప్రకటన చేసారు.
“మార్చి 31 నుంచి లాటరీ పద్ధతిలో రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని, జూన్ నుంచి అమరావతిలో రహదారుల నిర్మాణం ప్రారంభం అవుతుందని, కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని ప్రాంతంలో ఉన్న 360 ఇళ్లు తొలగించాల్సి వస్తుందని, వారికివ్వాల్సిన పరిహారంపై రెండు రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని” పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
ADVERTISEMENT
ADVERTISEMENT





