50 లక్షల రూపాయలు ఇవ్వకుంటే తన కుమార్తె, బాలీవుడ్ కుర్ర హీరోయిన్ ఆలియా భట్ ను హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని దర్శక నిర్మాత మహేష్ భట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఓ గ్యాంగ్ లీడర్ నని చెప్తూ… ఓ వ్యక్తి చేసిన మొదటి ఫోన్ ను ఉత్తుత్తి బెదిరింపని వదిలేశానని, ఆపై వరుసగా వాట్సప్, ఎస్ఎంఎస్ లు పంపుతూ, తన మాటలను తేలికగా తీసుకోవద్దని అతను హెచ్చరించాడని తెలిపారు.
ADVERTISEMENT
లక్నోకు చెందిన ఓ బ్యాంకు శాఖలో ఈ డబ్బు డిపాజిట్ చేయాలని సూచించాడని భట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆలియా, సోనీలను దారుణంగా చంపేస్తానని, వాళ్ల శరీరాల్లోకి బులెట్లను దింపుతానని అంటుండటంతో ఫిర్యాదు చేస్తున్నానని వివరించారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మహేష్ భట్ నివాసం ప్రాంతంలో భద్రతను పెంచారు.
ADVERTISEMENT



