వైరల్ గా మారిన దీపికా నడుం సాంగ్!

Deepika Padukone Padmaavat Ghoomar Song-‘ప‌ద్మావ‌త్’ చిత్రం విడుద‌ల కోసం సెన్సార్ బోర్డు వారు చెప్పిన స‌వ‌ర‌ణ‌ల్లో ‘ఘూమ‌ర్’ పాట‌కు సంబంధించిన స‌వ‌ర‌ణ ఒక‌టి ఉంది. ఆ పాట చిత్రీక‌ర‌ణ‌లో ప‌ద్మావ‌తి పాత్ర‌లో న‌టించిన దీపికా ప‌దుకునే న‌డుమును చూపించిన స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని సీబీఎఫ్‌సీ కోరింద‌ట‌.

ADVERTISEMENT

అయితే ఆ సీన్లు తొల‌గిస్తే పాట కోసం రాజ‌స్థానీ ఘూమ‌ర్ నృత్యంలో చేసిన కొరియోగ్ర‌ఫీ దెబ్బ‌తింటుంద‌ని న‌డుమును గ్రాఫిక్స్ ద్వారా క‌ప్పి వేస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెప్పార‌ట‌. దానికి సీబీఎఫ్‌సీ అంగీక‌రించ‌డంతో ఆయా మార్పులు చేసి పాట వీడియోను తిరిగి విడుద‌ల చేశారు నిర్మాత‌లు.

ఇప్పుడు ఆ కొత్త‌గా విడుద‌ల చేసిన పాట ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. పాత పాట వీడియో కూడా యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉండ‌టంతో ఈ రెండు వీడియోల‌ను నెటిజ‌న్లు పోల్చి చూస్తున్నారు. అలా పోల్చి చూస్తేనే గానీ తేడాల‌ను క‌నిపెట్ట‌లేనంత‌గా ఈ కొత్త వీడియో ఉంది. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి!

ADVERTISEMENT
Latest Stories