pawan-kalyan Warned Fans in Tirupati

సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ గురువారం తిరుపతికి వచ్చి తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామార్శించారు.

అధినేత వస్తే ఘనంగా స్వాగతం పలకాలనుకున్న వైసీపీ నేతలు భారీ సంఖ్యలో కార్యకర్తలని ఏర్పాటు చేసి స్వాగతం పలికించారు. వారు ‘జై జగన్‌.. జైజై జగన్‌..’ అని నినాదాలు చేస్తుంటే జగన్‌ అభివాదాలు చేస్తూ, సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు.

Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!

‘ఈయన పరామర్శకు వచ్చారా లేక రోడ్ షో చేయడానికి వచ్చారా?’ అని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. రోడ్లపై ఈవిదంగా ఊరేగినవారు ఆ జనాన్ని వెంటేసుకొని నేరుగా ఆస్పత్రిలో రోగుల వద్దకు వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్ళి రోగులను పరామర్శించి బయటకు వచ్చేయాలి. కానీ జగన్‌ అక్కడా ‘ఫోటో సెషన్’ పెట్టారు. మృతులు, క్షతగాత్రుల పట్ల బాధ కంటే చంద్రబాబు నాయుడుపై అక్కసే ఆయన మాటలలో ఎక్కువగా కనిపించింది.

పవన్ కళ్యాణ్‌ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎప్పటిలాగే అభిమానులు ఎగబడ్డారు. నినాదాలు కూడా చేశారు. కానీ అందుకు పవన్ కళ్యాణ్‌ జగన్‌లాగా సంతోషించలేదు.

Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?

పోలీసుల చేతిలో ఉన్న మైకు తీసుకొని, “ఇది ఆనందించే సమయమా?ఏడ్చే సమయమా?మీకెవరికీ బాధ అనిపించట్లేదా?” అంటూ అభిమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని, అందరూ పోలీసులకు సహకరించాలని పవన్ కళ్యాణ్‌ అభిమానులను గట్టిగా హెచ్చరించారు. ఈ ఒక్కటీ చాలు.. జగన్‌, పవన్‌ మద్య తేడా తెలుసుకోవడానికి.

సిఎం చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ కూడా ఆస్పత్రిలోకి వెళ్ళినప్పుడు తమ వెంట ఎవరూ రావడానికి వీల్లేదని ఖరాఖండీగా చెప్పేశారు. ఓకే ఒక్క మీడియా ప్రతినిధిని, ఒకరిద్దని వెంట పెట్టుకొని, అందరూ మొహాలకు మాస్కులు ధరించి క్షతగాత్రులని పరామర్శించి వెళ్ళారు.

Also Read – ‘తమిళ’ దర్శకులు ‘తెలుగు’ వారిని మెప్పించలేరా..?


చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ పద్దతిగా, హుందాగా వ్యవహరించగా, జగన్‌ చవుకబారు రాజకీయాలు చేశారు. పవన్ కళ్యాణ్‌ తన అభిమానులకు చెప్పిందే జగన్‌కు కూడా చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది.