అందరు బాబు మనుషులేనా? నీ భాదేంటి స్వామి.!

Deputy CM Narayana Swamy

తమకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎక్కడ ఎం జరిగినా దానికి కారణం చంద్రబాబే అంటూ వైసీపీ నాయకులు చేస్తున్నప్రచారాలు, విమర్శలు చూస్తుంటే ఒక్కో సారి నవ్వు, ఒక్కో సారి జాలి కలుగుతుంది అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు.

జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినా, పక్క రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, కొత్త ప్రభుత్వాలు వచ్చి నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరిగినా దానికంతటికి కారణం చంద్రబాబే అంటూ వైసీపీ నాయకులు ఒకరిని మించి ఒకరు ఆరోపణలు చేస్తుంటారు.

ADVERTISEMENT

తాజాగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికకాబడిన కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పటికి టీడీపీ వ్యక్తే అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గానే తెలంగాణలో ఎన్నికలు జరిగాయని, కుల,మతాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిందని, కుతంత్రాలతో బిఆర్ఎస్ పార్టీని ఓడించారంటూ బిఆర్ఎస్ పార్టీ మీద వైసీపీ సానుభూతిని తెలియచేసారు స్వామి.

బిఆర్ఎస్ ఓటమితో చంద్రబాబుకి మేలు జరుగుతుందని,రేవంత్ ఇప్పటికి టీడీపీ మనిషే అంటూ తమకలవాటైన చంద్రబాబు పాఠం చదివేసారు నారాయణ స్వామి.కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ గెలుపుకి టీడీపీ పార్టీకి సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేస్తున్న వైకాపా నాయకులు గత తెలంగాణ ఎన్నికలలో తెరాస పార్టీ విజయం సాధించినప్పుడు వైసీపీ నేతలలో కొందరు సంబరాలు కూడా చేసుకున్నారు.

అలా అయితే తెరాస పార్టీ గెలుపుకి వైసీపీ పార్టీకి సంబంధం ఉన్నట్టేగా? ఈ నేపథ్యంలో కేసీఆర్ జగన్ మనిషేనా? దీనికి కూడా నారాయణ స్వామి సమాధానము చెపితే బాగుంటుంది అంటున్నారు టీడీపీ శ్రేణులు.

ADVERTISEMENT
Latest Stories