ట్రైలర్ టాక్ – తెలుగు ఆడియన్స్ కు పండగే!

Dhoni Telugu Trailer, Dhoni Telugu Trailer Talk, Dhoni Telugu Movie Trailer Talk, MS Dhoni Telugu Trailer Talk, MS Dhoni Telugu Movie Trailer Talk, Dhoni Telugu Biopic Trailer Talkఇటీవల విడుదలైన ‘ఎం.ఎస్.ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ ధియేటిరికల్ ట్రైలర్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ట్రైలర్ ను తెలుగు భాషలోకి అనువదించగా, నాచురల్ స్టార్ నాని, ఈ ట్రైలర్ ను విడుదల చేసారు. ప్రాంతీయ భాషతో ఈ ‘ఎం.ఎస్.ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల్లోకి మరింతగా చొచ్చుకుపోయేలా కనపడుతోంది.

ఓ పక్కన రైల్వే ఉద్యోగం, మరో పక్కన క్రికెట్ ఆట నడుమ ధోని ఎలా నలిగిపోయాడు, ఒక సాధారణ కుటుంబం నుండి ఇండియన్ క్రికెట్ ను శాసించే వ్యక్తిగా ఎలా ఎదిగాడు… అలాగే ఎదిగిన తర్వాత ముగ్గురి దిగ్గజ క్రికెటర్ల రిటైర్మెంట్ వంటి సున్నితమైన అంశాలతో కూడికుని ఉన్న ధోని జీవిత విశేషాలతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరించేదిగా కనపడుతోంది. ముఖ్యంగా తెలుగులోకి డబ్ చేయడంతో, ఏపీ, తెలంగాణా మార్కెట్ లలో కూడా భారీ విజయానికి అవకాశం కల్పించినట్లవుతోంది.

ADVERTISEMENT

తెర మీద సుశాంత్ సింగ్ కనపడుతున్నా… అందరికీ మహేంద్ర సింగ్ ధోనినే దర్శనమిస్తుండడంతో… సెప్టెంబర్ 30న విడుదల కాబోయే సినిమా కోసం వేచి ఉండడం మహేంద్ర సింగ్ ధోని అభిమానులు మరియు సినీ ప్రియుల వంతవుతోంది. ట్రైలర్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో వీక్షిస్తున్న ప్రేక్షకులలో ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. దటీజ్… ధోని స్టోరీ… అంటున్నారు అభిమానులు..!

ADVERTISEMENT
Latest Stories