Jagan CBN

పదవి, అధికారం ఎంతో అదృష్టం మరెన్నో అంశాలు కలిసివస్తేగానీ లభించవు. ఒక్కోసారి దశాబ్ధాలపాటు ఎదురుచూసినా ఆ అదృష్టం రాకపోవచ్చు. కానీ జగన్‌కి పదేళ్ళు రాజకీయాలలో తిరిగేసరికి ముఖ్యమంత్రి పదవి లభించింది. కానీ ఆ గొప్ప అదృష్టాన్ని, ప్రజలు ఇచ్చిన ఒక్క గోల్డెన్ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోలేక అధికారం కోల్పోయి మళ్ళీ ఇప్పుడు దాని కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం నాలుగు నెలలే అయ్యింది. అప్పుడే అభివృద్ధికి కొత్తబాటలు వేస్తున్నారు. నిన్న మంగళగిరిలో జరిగిన డ్రోన్‌ సదస్సు ఇందుకు తాజా నిదర్శనం.

Also Read – రేపు రెంటపాలకు జగన్‌.. ఏం ప్లాన్ చేశారో?

నేటికీ దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐ‌టి కంపెనీల గురించి ఆలోచిస్తుంటే, చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, డ్రోన్‌ల తయారీ, వినియోగం, వాటికి అనుమతులు, మరమత్తుల శిక్షణ గురించి ఆలోచిస్తుండటం విశేషమే కదా?

భారత్‌లో డ్రోన్‌ల వాడకం గణనీయంగా పెరిగినప్పటికీ నేటికీ వాటి తయారీ, టెక్నాలజీ, మరమత్తుల శిక్షణ గురించి పెద్దగా ఆలోచన జరగలేదనే చెప్పొచ్చు.

Also Read – కుప్పం ఘటన: వైసీపీ మొదలుపెట్టేసిందిగా!

కనుక ఈ దిశలో సిఎం చంద్రబాబు నాయుడు వేస్తున్న తొలి అడుగు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గొప్ప వరంగా మారబోతోందని చెప్పవచ్చు.

డ్రోన్‌ హబ్‌గా కర్నూలు జిల్లాలో ఓర్వకల్లుని ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయమే. ఓర్వకల్లు బెంగళూరు-హైదరాబాద్‌ నగరాలకు మద్యలో ఉండటం, విమానాశ్రయం ఉండటం వలన ఫ్లయింగ్ జోన్‌ సౌకర్యం కలిగి ఉండటం, ముఖ్యంగా ఓర్వకల్లులో 10,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం ఈ డ్రోన్‌ల పరిశ్రమ ఏర్పాటు చేసి శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది.

Also Read – కవిత, షర్మిల: రాజకీయంగా బలైపోయిన చెల్లెళ్ళ కథేనా.?

డ్రోన్‌లు పరిశ్రమలు ఏర్పాటు చేయడమే కాదు వాటిని ఏయే రంగాలలో వినియోగించుకోవచ్చో ఆలోచించి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారుచేయాలనే సిఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది.

ఓర్వకల్లులో డ్రోన్‌ల తయారీ పరిశ్రమలకు ఫ్లయింగ్ జోన్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, డ్రోన్‌లు లైసెన్స్ తదితర అన్ని రకాల అనుమతులు మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన డ్రోన్‌ల తయారీ పరిశ్రమలు ఏర్పడేందుకు చాలా దోహదపడుతుంది.

ఏడు పదుల వయసులో సిఎం చంద్రబాబు నాయుడు ఏఐ, డ్రోన్‌ల గురించి ఆలోచిస్తున్నారు… మాట్లాడుతున్నారు. కానీ ఆయనకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కానీ తాను అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగలనని, తాను యువకుడిని, విదేశాలలో ఉన్నతవిద్యలు అభ్యసించిన వచ్చాను కనుక తాను చాలా తెలివైనవాడినని గొప్పగా చెప్పుకునే జగన్‌కు ఇటువంటి ఆలోచనలు కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?

జగన్‌ మూడు రాజధానులు, కర్నూలు న్యాయరాజధాని అని కబుర్లు చెపుతూ 5 ఏళ్ళు కాలక్షేపం చేసి దిగిపోయారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఓర్వకల్లులో యావత్ భారత్‌కే దిక్సూచిగా మారాబోయే డ్రోన్‌ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆచరణలో పెట్టి చూపించబోతున్నారు.

పాలకులకు ఇంత దూరదృష్టి, నిబద్దత ఉండటం చాలా అవసరం. జగన్‌కి అది లేదని, సిఎం చంద్రబాబు నాయుడుకి అది పుష్కలంగా ఉందని ఇద్దరూ నిరూపించుకున్నారు కదా?