
ఓ జలవనరుల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి తనకు రాష్ట్రంలో నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్ట్ తనకు అవగాహన లేదని గురించి చెప్పడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనే మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టు గురించి తనకు అర్దం కాలేదని నిర్మొహమాటంగా ఒప్పేసుకున్నారు.
జగన్‌లాగా తనకు తెలియని విషయాన్ని తెలిసిన్నట్లు నటిస్తూ పార్టీని, ప్రజలను మభ్యపెట్టకుండా నిజాయితీగా ఒప్పేసుకునందుకు సంతోషించాల్సిందే.
Also Read – మేలు చేస్తే ఎన్నికల వరకే అభివృద్ధి చేస్తే…
అయితే అంబటి రాంబాబు గురించి ఓ గంటా, అర గంటలో అన్నీ చెప్పుకోలేము. కనుక హైలైట్స్ మాత్రమే చెప్పుకుంటే సంక్రాంతికి సత్తెనపల్లిలో ఆయన చేసే డ్యాన్స్ ఒక్కటీ సరిపోతుంది. అంబటి రాంబాబు ఐదేళ్ళు ట్విట్టర్‌లోనే ఉండిపోయారు తప్ప సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎన్నడూ మాట్లాడిందీ లేదు.. కనీసం ప్రాజెక్టుల వద్ద ఫోటో దిగిందీ లేదు.
అదే జలవనరుల శాఖని ప్రస్తుతం నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు. నాలుగైదు రోజులుగా బుడమేరు వద్ద మకాం వేసి గండ్లు పూడ్పిస్తున్నారు. జోరుగా కురుస్తున్న వానలో ఓ గొడుగు వేసుకొని పూడ్చివేత పనులు చేయిస్తున్నారు. బుడమేరు చివరి గండిని నేడు పూడ్చేసి విజయవాడ నగరంలోకి వరద నీరు ప్రవహించకుండా అడ్డుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతున్నారు.
Also Read – చంద్రబాబు నాయుడు @75: అదే పోరాటస్పూర్తి
అంబటి రాంబాబు, నిమ్మల రామానాయుడు ఇద్దరూ ఒకే శాఖని నిర్వహించారు. కానీ వారి పనితనం, నిబద్దతలో ఎంత తేడా ఉందో అర్దం చేసుకునేందుకు ఈ ఉదాహరణలు చాలు కదా?
#విజయవాడ లో #వరదముంపు లో నానుతున్న వేలాది మందికి ఉపశమనం, వరదకు అడ్డుకట్ట వేయాలంటే #బుడమేరు గండ్లు పూడిక పనులు ద్వారా నియంత్రించవచ్చుననే చంద్రబాబు సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతిరోజు #వర్షం, #వరద వెంటాడుతున్న లెక్కచేయకుండా రాత్రింబవళ్లు గట్టుపైనే గడుపుతూ, పట్టు వదలని… pic.twitter.com/cN6exvF4mI
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) September 6, 2024