ప్రభుత్వ – ప్రయివేట్ రంగాలలో ఏ జాబులు సాధించాలి అన్నా మినిమమ్ ఈ అర్హతలు ఉండాలి అంటూ కొన్ని నిర్దిష్ట షరతులు పెట్టే ఈ సమాజంలో రాజకీయాలలో ప్రజాసేవ చేయాలి అంటూ ముందుకొస్తున్న రాజకీయ నేతలకు మాత్రం ఎటువంటి అర్హతలు ఉండాలి అనే దాని పై ఒక స్పష్టత లేదు. దానితో రానురాను వీరి అర్హతలను రాజకీయ పార్టీలే నిర్ణయిస్తూ వచ్చేస్తున్నాయి.
రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, వేల కోట్ల ఆస్తులు ఉండి, కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే చాలు వారు కచ్చితంగా ఎమ్మెల్యే అర్హత పొందినట్లే అనేది నేటి రాజకీయంలో ఆనవాయితీగా మారిపోయింది. ఇటువంటి సందర్భంలో నేడు టీడీపీ – జనసేన విడుదల చేసిన మొదటి జాబితాలోని అభ్యర్థుల అర్హతలు ఆసక్తికరంగా ఉన్నాయి.
విడుదలైన అభ్యర్థులలో అందరు దాదాపుగా చదువులో డిగ్రీలు సాధించినవారే కావడం నేటి రాజకీయాలలో ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. టీడీపీ, జనసేన పార్టీల తరుపున విడుదల చేసిన 118 సీట్లకు గాను టీడీపీ నుంచి 94 , జనసేన నుంచి 24 మందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో టీడీపీ నుంచి 94 మందిని జనసేన నుంచి 5 గురిని మొత్తం 99 మంది పేర్లు ప్రకటించారు.
ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులలో అందరు మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారే కావడం విశేషం.ఇందులో 63 మంది గ్రాడ్యువేట్లు, 30 మంది పోస్ట్ గ్రాడ్యువేట్లు, ఒక ఐఏఎస్, ఇద్దరు పిహెచ్డి , ముగ్గురు ఎంబిబిఎస్ లకు సీట్లు దక్కాయి. దీనితో ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఈ కూటమి గట్టున సీటు కావాలంటే చదువులో మినిమమ్ డిగ్రీ ఉండాలి….ఆ వైసీపీ పార్టీ గట్టున సీటు కావాలంటే బూతులతో మినిమమ్ డిగ్రీ ఉండాలి…కాబట్టి ప్రజలు ఏ గట్టున ఉంటారో ఒక్క ఆలోచించుకుని ఓటు వేయాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇందుకు ఉదాహరణగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు,గుడివాడ అమర్నాధ్….వంటి నేతలు మాట్లాడిన బూతుల వీడియోలను పోస్ట్ చేస్తూ వైసీపీ నేతల ఎమ్మెల్యే కు ఉండాల్సిన మినిమమ్ అర్హతలు ఇవే అంటూ కామెంట్ చేస్తున్నారు.






