జగన్ పాదయాత్రకు, బాబు పాదయాత్రకు అదే తేడా!

Difference between YS Jagan and Chandrababu Naidu Padayatraఈరోజు కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగన్‌కు మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలిరాగా, తొలి రోజు సుమారు 8.9 కిలోమీటర్ల మేర నడిచారు. అయితే జగన్ పాదయాత్ర తొలిరోజుపై విశ్లేషకుల అభిప్రాయం ఇది.

జగన్ పాదయాత్ర లో పాటలు, ఆయన మాట్లాడుతున్న మాటలు అన్ని వ్యక్తిగతంగా ఆయన్ని ఆయనని పొగుడుతూ వై యస్ ఆర్ ని పొగుడుతూ ఉన్నాయి. అదే విధంగా ఎక్కువ కాలం ప్రభుత్వం పై విమర్శలు, చంద్రబాబు నాయుడుకి శాపనాకారాలు పెట్టడానికే వినియోగించారు. అయితే చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో ఆయన తీరు మొత్తానికి వేరు.

ADVERTISEMENT

ఆయన ఎక్కువ కాలం ప్రజలతో మమేకం కావడానికి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. పాదయాత్ర పాటలు కూడా అలానే ఉండేవి. ఇప్పుడు ఏమిట్రా అంటే ముఖ్యమంత్రి కావడం మా లక్ష్యం, ఆ లక్ష్యం కోసం మీరంతా కూడా నిద్రాహారాలు మాని కష్టపడాలి అన్నట్టు ఉంది జగన్ వ్యవహారం అని విశ్లేషకుల అభిప్రాయం.

రానున్న రోజులలో పాదయాత్ర జరుగుతున్నా తీరు పై ఆ పార్టీ నాయకులూ ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని వస్తున్నా ఫీడ్ బ్యాక్ బట్టి మార్పులు చేస్కోవడం బెటర్. ఏ రాజకీయనాయకుడైన పాదయాత్ర చేసేది రాజకీయ లబ్ది కోసమే అయినాసరే ప్రజలకు కనెక్ట్ అయ్యే పద్దతి కచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ పద్దతి ఎంత ఫాస్ట్ గ తెలుసుకుంటే జగన్ కు అంత మంచిది.

ADVERTISEMENT
Latest Stories