పవన్ ఫ్యాన్ కు రెండిచ్చిన దిల్ రాజు?

Dil Raju About his involvement in Fidaaటాలీవుడ్ హీరోగా కంటే పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా నితిన్ చేసే హంగామా తెలియనిది కాదు. తన సినిమాలు విడుదలైనపుడు కంటే… పవర్ స్టార్ సినిమాల విడుదల సమయంలో నితిన్ చేసే ట్వీట్లు పవన్ అభిమానులను ఓ రేంజ్ లో అలరిస్తున్న వైనం అంతా బహిర్గతమే. అలాంటి నితిన్ “లై” సినిమాతో వెనుకపడ్డాడు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా ఫెయిల్ కావడంతో, నితిన్ కు ఓ హిట్టు ఖచ్చితంగా కావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ అవకాశాన్ని దిల్ రాజు “శ్రీనివాస కళ్యాణం” రూపంలో ఇవ్వబోతున్నాడని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాతో పాటు మరో సినీ అవకాశాన్ని కూడా దిల్ రాజు నితిన్ కు ఇచ్చాడనే టాక్ ఊపందుకుంది.

ADVERTISEMENT

కెరీర్ తొలినాళ్ళల్లో వరుస సక్సెస్ లు చవిచూసిన దిల్ రాజు, మధ్యలో గాడి తప్పినప్పటికీ, ప్రస్తుతం దిల్ రాజు పేరు అంటే సక్సెస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. దీంతో ఈ రెండు సినిమాలతో నితిన్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ ఖాయం అంటున్నారు. ఇంతకీ రెండవ సినిమా ఎవరిదీ అంటారా… వరుసగా కమర్షియల్ సక్సెస్ లు చవిచూస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తీయనున్న మల్టీస్టారర్..!

ADVERTISEMENT
Latest Stories