అయ్యో… దిల్ రాజుకు ఎంత కష్టం వచ్చింది..!

Dil Raju Wife Anita Passed Away Due to Cardiac Arrestకుటుంబ విలువలు గల సినిమాలను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించే నిర్మాతలలో మొదటి వరుసలో ఉండే దిల్ రాజుకు సతీవియోగం కలిగింది. అవును… ‘కార్డియాక్ అరెస్ట్’తో అపోలో హాస్పిటల్ కు వెళ్ళిన దిల్ రాజు భార్య తుదిశ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో దిల్ రాజు కుటుంబానికి అతి పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. మరో కీలక అంశం ఏమిటంటే… ప్రస్తుతం దిల్ రాజు అమెరికాలో ఉన్నారు.

కుటుంబం అంటే దిల్ రాజుకు మరో ప్రపంచం అంటుంటారు సినీ వర్గీయులు. ఫ్యామిలీకి అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టే, మానవ సంబంధాలు, అనుబంధాలు అంటే దిల్ రాజుకు పిచ్చి అని, అందుకే ఇలాంటి కధలతో ఎన్ని సినిమాలైనా తీస్తూనే ఉంటారని, ఈ ఏడాది సంక్రాంతి “శతమానం భవతి” ద్వారా కూడా మరోసారి కుటుంబ విలువలను చాటిచెప్పిన దిల్ రాజుకు జీవితంలో తీరని కష్టం వాటిల్లడంతో, సినీ వర్గీయులంతా కూడా ఒక్కసారిగా డీలా అయిపోయారు.

ADVERTISEMENT

దిల్ రాజు కుటుంబానికి కొండంత ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుందాం.

ADVERTISEMENT
Latest Stories