బాలీవుడ్ దర్శకుడుపై మోడల్ అత్యాచార కేసు!

Director Arhan Akhtar Model Accuses Cheating, Director Arhan Akhtar Model Accuses Fraud, Director Arhan Akhtar Model Accuses Bodyshamingమోడల్ గా పనిచేస్తూ నటిగా రాణించాలన్న తన కోరికను అలుసుగా తీసుకుని నమ్మించి మోసం చేయడంతో పాటు, తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ, బాలీవుడ్ దర్శకుడు అర్హాన్ అక్తర్, మరో ఇద్దరు ఫైనాన్షియర్లపై ఓ మోడల్ కేసు పెట్టింది. బాధితురాలి కథనం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ హీరోగా తాను తీయబోయే సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తానని అర్హాన్ హామీ ఇచ్చాడట.

అయితే, తన కోరిక తీరిస్తేనే ఈ చాన్స్ లభిస్తుందని చెప్పడంతో, సినిమా చాన్స్ కోసం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడిందట. ఆపై చిత్రానికి డబ్బు పెట్టేవాళ్లంటూ, ఇద్దరు ఫైనాన్షియర్ల వద్దకు కూడా వెళ్లమని చెప్పాడట. లక్నో, ఢిల్లీకి చెందిన ఫైనాన్షియర్ల వద్దకు మోడల్ వెళ్లింది. అయితే సినిమా అవకాశం మాత్రం చేజిక్కలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన మోడల్ పోలీసులను ఆశ్రయించడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories