రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమా తో డైరెక్టర్ గా అవతారమెత్తిన సంజన రెడ్డి. చాలా కాలం తరువాత కరణం మల్లేశ్వరి సినిమా అవకాశం దక్కించుకుంది. అయితే ఉన్నఫళంగా ఆమె కు కరోనా సోకిందని, ఐసీయూలో వెంటిలేటర్ పై ఉందని, పరిస్థితి సీరియస్ గా ఉందని వార్తలు వచ్చాయి.
అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని కరణం మల్లేశ్వరి నిర్మాత కోనా వెంకట్ ప్రకటించారు. “ఆమె మూడు రోజులుగా లిక్విడ్ డైట్ మీద ఉండటంతో కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్ లో పెట్టడం జరిగింది. రెండు మూడు రోజులలో డిశ్చార్జ్ అవుతుంది. వైరల్ ఫీవర్ అంతే… అంతకు మించి ఏమీ లేదు,” అని చెప్పుకొచ్చారు.
కరణం మల్లేశ్వరి బయోపిక్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టైటిల్ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ గానీ, తాప్సీ ని గానీ తీసుకోవాలని అనుకుంటున్నారు. రకుల్ కి వెయిట్ లిఫ్టింగ్ లో ప్రావీణ్యత ఉంది. ఆమెను తీసుకుంటే నిర్మాతల పని తేలిక అవుతుంది. తాప్సీ ని తీసుకుంటే బాలీవుడ్ మార్కెట్ వస్తుంది.
ఒలింపిక్స్లో ఇండియా తరఫున రెండుసార్లు బరిలోకి దిగిన మల్లేశ్వరి.. 1998 బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 63 కిలోల విభాగంలో రజతం, 2000లో సిడ్నీలో జరిగిన పోటీల్లో కాంస్యం పతకం గెల్చుకున్నారు. 1995లో చైనా, గ్వాంగ్జూలో జరిగిన వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో 54 కిలోల విభాగంలో మూడు స్వర్ణాలు గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్లో మల్లేశ్వరి చేసిన కృషికిగానూ..ఆమెను అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్రత్న, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం.
Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here





