ఆయన మారాడు…ఈయన మారతాడో లేదో?

Director Shankar - Director Rajamouliఇండియన్ సినిమా చరిత్రలో అగ్ర దర్శకులు ఎవరు అంటే ఆ లిస్ట్ లో రాజమౌళి, శంకర్ ఇద్దరూ ఉంటారు. ఎవరెవరు ఏ స్థానం అందుకుంటారో అన్న పిచ్చి లెక్క పక్కన పెడితే, ఇద్దరూ ఇండియన్ సినిమా చరిత్రలో లెజెండ్స్ గా మిగిలిపోతారు అన్నది మాత్రం నిజం. అయితే ఈ ఇద్దరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో అటు రాజమౌళి బాహుబలితో తన మార్క్ చూపిస్తే, ఇటు శంకర్ రోబోతో తన స్టైల్ లో ఆదరగొట్టాడు. మరి గ్రాఫిక్స్ లేకుండా మంచి కధతో కూడిన సినిమా వీళ్ళు మళ్లీ ఎప్పటికీ తీస్తారో అన్న చిన్న పాటి ఆలోచన వస్తే…

[m9ad]

ADVERTISEMENT

రాజమౌళి తన తర్వాత చేస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్” యాక్షన్ సినిమా అంటూ ఉన్నప్పటికీ అందులో కూడా గ్రాఫిక్స్ మొతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది అని తెలుస్తుంది. అదే జరిగితే ఈ సినిమా కూడా గ్రాఫిక్స్ లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. కానీ శంకర్ మాత్రం తన తరువాత సినిమా పూర్తి కధాభరితంగా తియ్యాలి, ఇక గ్రాఫిక్స్ జోలికి వీలైనంతవరకూ పోకూడదు అని తన తరువాత సినిమా ఇండియన్2లో కమల్తోనే అన్నీ చేయిస్తున్నాడు. గ్ర్యాఫిక్స్ మాయాజాలంతో భారీ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకులు, కధాభరిత సినిమాలతో అలరిస్తే ఎంతో బావుంటుంది. పైగా సినిమా తీసే సమయం కూడా తక్కువై, వీలైనంత త్వరగా సినిమా పూర్తి అవుతుంది. ఇక వారి సినిమాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు.

ఈ విషయంలో శంకర్ తన పంధా మారుకున్నాడు…కొన్నాళ్ళ వరకూ రోబో జ్ఞాపకాలతో మళ్లీ భారీ గ్ర్యాఫిక్స్ వైపు పోయేలా కనిపించడం లేదు. కానీ రాజమౌళి మాత్రం తన తరువాత సినిమా కూడా ఇదే గ్రాఫిక్స్ పంధాలో వెళ్ళడం చూస్తూ ఉంటే, ఈ సినిమా కోసం ఇంకెన్ని ఏళ్లు ఆగాలో అన్న నిరుత్సాహం ఫాన్స్ లో కాస్త ఉంది. మరి వారికోసం అయినా రాజమౌళి తన తరువాత సినిమాకి అయినా తన పంధా మార్చుకుని, త్వరగా సినిమా చేస్తాడేమో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories