హిట్ ఇచ్చే హీరో కావాలి…మెగా దర్శకుడు వెయిటింగ్!

వీ.వీ.వినాయక్ సంచలనాల దర్శకుడుగా ఒక వెలుగు వెలిగిన వినయ్…బాలయ్యతో ‘చెన్నకేశవరెడ్డి’లాంటి భారీ హిట్ ను అందుకున్నాడు. అయితే అప్పటికి వాళ్ళు అనుకున్న రేంజ్ కానీ సినిమా అయినా…ఆ సినిమా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ సినిమాగానే ఉండిపోయింది.

[m9ad]

ADVERTISEMENT

అయితే అలాంటి బాలయ్యతో వినయ్ మరోసారి సినిమా తియ్యనున్నాడు అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నప్పటికీ…కధ ఫైనల్ కాకపోవడంతో ఆ సినిమా పట్టాలు ఎక్కడం లేదు. ఇక తాజాగా వినిపిస్తున్న కధనం ప్రకారం ఈ సినిమా ఇక లేనట్లే అని తేలిపోయింది. ఎందుకంటే బాలయ్య ఎన్ఠీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఖైదీ-150 తో మంచి హిట్ ఇచ్చినా అది తమిళ రీమేక్ కావడంతో వినయ్ కి పెద్దగా పేరు రాలేదు. ఇక ఆ అఖిల్, ఇంటెలిజెంట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలవగా..ఇప్పుడు వినయ్ కి భారీ హిట్ ఇచ్చి మళ్ళీ ట్రాక్ లోకి తీసుకు వచ్చే హీరో కావాలి. మరి ఏ హీరో వినయ్ ను ఆదుకుంటాడో? ఏ హీరో “వినయ్ ఈజ్ బ్యాక్ అంటూ” భారీ హిట్ ఇస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories