సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోహీన్ల హవా తక్కువనే చెప్పాలి. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆదుర్దాతో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆశ పడుతుంటారు హీరోహీన్స్. ఆ కోవలోకే ప్రస్తుత క్రేజీ హీరోహిన్ శ్రీలీల వచ్చి చేరారు.
పెళ్ళిసందడి సినిమాతో దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో తెలుగు అమ్మాయిగా తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన వైపు ఆకర్షించుకుంది. రవితేజ ధమాకా తో తన డాన్స్ లతో యువత ని పల్సర్ బైక్ ఎక్కించిన అమ్మడు తనకొచ్చిన క్రేజ్ ను నిలుపుకోవడంలో తొందర పాటు నిర్ణయాలు తీసుకున్నారనే చెప్పాలి.
ఆ తరువాత వచ్చిన స్కంద, భగవత్ కేసరి,ఆదికేశవ్, ఎక్సట్రాడినరీ మాన్ వంటి సినిమాలలో ఒక్క బాలయ్య తో నటించిన భగవత్ కేసరి మినహా ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ముందు నిలబడలేకపోయాయి. భగవంత్ కేసరి కూడా కలెక్షన్ల పరంగా ఓకే కానీ సక్సెస్ పరంగా నాట్ ఓకే అనే చెప్పాలి. ఈ సంక్రాంతికి క్రేజీ కాంబో గా తెరకెక్కిన త్రివిక్రమ్, మహేష్ ల గుంటూరు కారం తో రీ లాంచ్ అంటూ ఆశ పడిన అమ్ము కి ఇక్కడ కూడా నిరాశే మిగిలింది. దీనితో సోషల్ మీడియాలో శ్రీలీల పై ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ కూడా మొదలయ్యింది.
ఒక సినిమా హిట్టా – ఫట్టా అనేది ఆ సినిమా హీరోహిన్ పై ఆధారపడి ఉండదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. సినిమాల రిజల్ట్ ను మార్చే స్థాయిలో సినిమాలో నటీమణులకు అవకాశం ఉంటుందా అంటే…? కేవలం పాటలు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే నటీమణులను ఎంచుకుంటారు దర్శకులు. వారికీ ఉన్న పరిధి మేరకు వారి ఫేరవర్మేన్స్ ఎలా ఉంది అని చూస్తారు కానీ మహేష్ వంటి స్టార్ హీరో సినిమా హీరోహిన్ వలన ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా..?అనేది ఒక్కసారి ట్రోల్ చేసే ముందు ఆలోచించాలి.
సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరో కానీ దర్శకుడి ఖాతాలో కాని పడుతుంది. అదే సినిమా ఫట్ అయితే దాని భారాన్ని కొంతైన హీరోహీన్స్ పై వేస్తారు. ఇదెక్కడి లోజికో అర్ధం కాదు. అయినా శ్రీలీల కూడా క్రేజీ హీరోలనో, పేరున్న డైరెక్టరనో, మంచి కాంబో కుదిరిందనో, వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకూడదనో కథ మీద, సినిమాలో తన క్యారెక్టర్ మీద ద్రుష్టి పెట్టకుండా సినిమాలు ఒప్పుకుంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి రిజల్టే ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికైనా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాల ఎంపిక చేసుకుంటే తనకున్న టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత పెద్ద కష్టమేమి కాదు ఈ డాక్టర్ పిల్లకు. గుంటూరు కారం రిజల్ట్ తో శ్రీలీల గ్యాప్ తీసుకుంటుందా? లేక ఇండస్ట్రీ నే ఈ తెలుగమ్మాయికి కాస్త గ్యాప్ ఇస్తుందో చూడాలి మరి.




