మీ బిడ్డ ‘ఓదార్పు’ కోరుకుంటున్నాడా..?

146 Criminal Charges On Jagan

మే 12 వరకు వైసీపీ నేతల మాటలలో ఉన్న కాన్ఫిడెన్స్ మే 13 పోలింగ్ ముగిసే నాటికి ఆవిరైయిపోయింది. దీనికి ప్రత్యేకించి రాష్ట్రంలో పెరిగిన ఓటింగ్ శాతం ఒక కారణం కాగా, ప్రజలలో ప్రశ్నించే తత్త్వం రావడం మరో కారణంగా చెప్పవచ్చు. పోలింగ్ పూర్తయిన మూడు రోజుల తరువాత బయటకొచ్చిన జగన్ ముఖంలో నిస్సహాయత, నిట్టూర్పు తప్ప మరేం కనపడడం లేదనేది స్పష్టమయింది. దీనితో ‘మీ బిడ్డ ఓదార్పు కోరుకుంటున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో మిమ్స్ మొదలయాయ్యి.

ఇన్నాళ్లుగా వైసీపీ మూకలు చేసిన దౌర్జన్యాలకు చరమ గీతం పాడే సమయం వచ్చింది అన్నంత పట్టుదలగా పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటేసేంత వరకు క్యూ లైన్లలోనే వేచిఉన్నారు ఓటర్లు. దీనికి తోడు ఓటమి భయంతో కొన్ని కొన్ని ప్రతిష్ట్మాక ప్రాంతాలలో వైసీపీ నాయకులు ఓటుకు 4 నుంచి 5 వేల వరకు ముట్ట చెప్పారు. అటువంటి ప్రాంతాలలో కూడా కూటమికే అనుకూలంగా ఓట్లు పడ్డాయి అనే సంకేతంతో జగన్ తీవ్ర నిరుత్సహానికి గురయ్యారంటా.

ADVERTISEMENT

రెండు సంవత్సరాల నుండి గడప గడపకు కార్యక్రమంతో ప్రజలలో ఉన్నా, నువ్వే నా నమ్మకం జగనన్నా అని ప్రజలను నమ్మించినా, రాష్ట్రమంతా వైసీపీ రంగులు వేసినా, వీధికో వైస్సార్ విగ్రహం ప్రతిష్టించినా, ప్రతి పథకానికి జగనన్న పేరుతో నామకరణం చేసినా, ప్రతిపక్ష నేతల గొంతు నొక్కినా, కేసులు పెట్టి, అరెస్టులు చేసి, దాడులతో బయపెట్టినా, ఐదేళ్ల నుంచి అప్పులు చేసి మరి సంక్షేమ పథకాల బటన్ నొక్కుతున్నా ఎన్నికల రోజు ఈవీఎం లలో వైసీపీ బటన్ నొక్కక పోవడానికి కారణం ఏమిటో అంటూ నిరాశ, నిస్పృహలోకి వైసీపీ అధినాయకత్వం వెళ్లిపోయిందనేది సజ్జల గారి వ్యాక్యలతో స్పష్టమయింది.

ఇన్నాళ్ళుగా నడి రోడ్డు మీద ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చి వాడిని చేసి చితకొట్టినా నోరెత్తని ప్రజానీకం ఈనాడు ఒక చెంప మీద కొడితే ఆ కొట్టిన వాడు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవడైతే నాకేంటి అంటూ తిరిగి చెంప పగలకొట్టాడు. ప్రజలలో ఇంత తెగువ తెగింపు చూసి ఇన్నాళ్లుగా నోటికి పని చెప్పిన ప్రతి వైసీపీ నాయకుడు వెనకడుగు వేస్తున్నాడు. పోలింగ్ సరళి బట్టి గెలుపోటముల మీద ఒక అంచనాకు వచ్చిన వైసీపీ తన భవిష్యత్తు ఉహించలేకపోతుందా అన్నట్టుగా ఒక్కొక్క వైసీపీ నేత ముఖంలో నైరాశ్యం అలువుకుంది.

మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు లేడు, ఒక ఈనాడు కానీ ఒక ఆంధ్ర జ్యోతి కానీ, ఒక టీవీ 5 కానీ లేవు. మీ బిడ్డ అభిమన్యుడు కాదు అర్జునుడు. మీ బిడ్డ ఒక దుష్ట చతుష్టయం తో పోరాడుతున్నాడు. మీ బిడ్డకు ప్రజలే దేవుళ్ళు. మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లు మీరే. మీ బిడ్డకు ఆ దేవుని ఆశీస్సులు మీ చల్లని దీవెనలు కావాలి అంటూ వేడుకున్నా కూడా ఆ బిడ్డ మీద ఓటర్లు కనికరం చూపించలేదంటూ ఆవేదన చెందుతున్నారు జగన్ అంటూ వైసీపీ లో అంతర్మధనం జరుగుతుంది.

వైస్సార్ మరణం తో ఆయన అభిమానుల కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన జగన్ కు జూన్ 4 తరువాత ఓదార్పు అవసరంవుతుందనే నమ్మకంతో ఉన్నారు కూటమి పార్టీల నేతలు. జగన్ ను ఓదార్చడానికి మీరు సిద్ధమా..? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories