ట్రంప్‌ని ఎందుకు ఎన్నుకున్నారు? ఏం చేస్తున్నారు?

Donald Trump Policies

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనాల్డ్ ట్రంప్‌ తనను మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నుకుంటే అన్ని రంగాలలో అమెరికాని అభివృద్ధి చేసి చూపిస్తానని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చిటికెలో ఆపించేస్తానని చెప్పి గద్దెనెక్కారు. కానీ అధ్యక్షుడైన తర్వాత అమెరికాని అభివృద్ధి చేయడం సంగతి దేవుడెరుగు కనీసం అమెరికాని పాలించడం లేదు.

మొదట సుంకాలు అంటూ కొన్ని నెలలు హడావుడి చేస్తూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశారు. తర్వాత హెచ్1 బీ వీసాలతో మరోసారి హడావుడి చేశారు. తర్వాత రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు జరిపారు. కానీ వాటి యుద్ధం ఆపటం ట్రంప్‌ వల్ల కాలేదు. ఇప్పుడు ఇరాన్‌తో మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని ట్రంప్‌ కూడా ఆపలేక గౌరవప్రదంగా బయటపడలేక అవస్థలు పడుతున్నారు.

ADVERTISEMENT

భారత్‌-పాక్‌ యుద్ధం మాత్రం నిలిపివేయించగలిగారు. మద్యలో వెనిజువేలపై దండెత్తి ఆ దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేశారు. కనుక అమెరికాని పాలించేందుకు ప్రజలు ట్రంప్‌ని ఎన్నుకుంటే, ఆయన ఆ ఒక్కటీ తప్ప మిగిలిన అనసరమైన పనులన్నీ చేస్తున్నారని అర్ధమవుతోంది.

ట్రంప్‌ ధోరణిని భారత్‌తో సహా ఎవరూ మార్చలేరు. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం విఫలమవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ట్రంప్‌ చేస్తున్న ఈ యుద్ధాల వలన అమెరికాతో సహా ప్రపంచాదేశాలన్నిటికీ నష్టమే తప్ప లాభం ఉండదు. ఈ యుద్ధాల వలన అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది.

కనుక ట్రంప్‌ని సరిచేయగల శక్తిసామర్ధ్యాలు కేవలం అమెరికన్లకు, డెమోక్రాట్లు మాత్రమే ఉన్నాయి. వారు మాత్రమే ట్రంప్‌ని గట్టిగా నిలదీస్తూ అడ్డుకోగలరు.

ADVERTISEMENT
Latest Stories