ట్రంప్ నగ్నంగా చూసాడు… సంచలన ఆరోపణలు..!

tasha-dixon-trumpఅమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన ట్రంప్ చుట్టూ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత జీవితంలో ఉన్న మరకలు ఒక్కొక్కటీ ఇప్పుడు ప్రత్యర్ధులకు వరంగా మారి, ట్రంప్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ‘తన కుమార్తె అందాలను పొగడటం దగ్గర నుండి మహిళలపై అనుచిత వ్యాఖ్యల వరకూ’ ఎన్నో ఆరోపణల్లో అడ్డంగా చిక్కుకున్న ట్రంప్ పై మాజీ మిస్ ఆరిజోనా (2001) తాషా డిక్సన్ సంచలన ఆరోపణలు చేసారు.

ADVERTISEMENT

2005 ఏప్రిల్ లో ‘మిస్ అమెరికా’ పోటీలు జరుగుతున్న వేళ, ప్రధాన స్పాన్సరర్ గా ఉన్న ట్రంప్, పోటీదారుల డ్రస్సింగ్ రూములో తిష్ట వేసుకుని కూర్చుని అమ్మాయిలను నగ్నంగా చూస్తూ ఆనందం పొందాడని ఆరోపించింది. పోటీలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ట్రంప్ తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ… “నేను ఇప్పుడు స్టేజ్ వెనక్కి వెళుతున్నాను. అందరూ దుస్తులు ధరించి సిద్ధమవుతుంటారు. అక్కడ పురుషులు ఎవరూ ఉండరు. కానీ నేను మాత్రం వెళ్లగలను. ఎందుకంటే, ఈ పోటీల యజమానిని నేనే కాబట్టి. వెళ్లి పరిశీలించి వస్తాను” అని అన్నాడని, ఆపై లోపలికి వెళ్లి వచ్చి “నీకు తెలుసా? వారంతా నగ్నంగా నిలబడి వున్నారు. ఎంత అందమైన అమ్మాయిలు… ఇలాంటి వాళ్లతో బయటకు వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నా” అని అన్నారని పేర్కొంది.

పోటీలలో భాగంగా, యువతులు సాధారణ దుస్తుల నుంచి బికినీల్లోకి మారుతున్న వేళ ట్రంప్ అక్కడే నిలబడి చూస్తూ ఆనందం పొందాడని, ఎవరూ అడ్డు చెప్పలేకపోయారని తాషా డిక్సన్ వెల్లడించింది. “అతను గదిలోకి వచ్చిన వేళ అడ్డుకునేందుకు ఎవరూ లేరు. కొంతమంది టాప్ లెస్ గా ఉండగా, మరికొందరు పూర్తి నగ్నంగా ఉన్నారు. అర్ధ నగ్నంగా ఉన్న నేను బికినీ ధరిస్తున్న వేళ ట్రంప్ ను చూశాను. ఏమీ చేయలేని పరిస్థితి అక్కడి పోటీదారులది. అక్కడున్న కొందరు ట్రంప్ వద్దకు వెళ్లి, అతని దృష్టిలో పడాలని మాకు సలహాలు కూడా ఇచ్చారు. ఆ సమయంలో అతనిపై మాకు ఫిర్యాదు చేయాలని వున్నా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి” అని పేర్కొంది.

ADVERTISEMENT
Latest Stories