ట్రంప్‌ చేతికీ, నోటికీ పనే… ఈసారి నోబుల్ పక్కా!

Donald Trump Stops 8 Wars, Eyes Nobel Peace Prize

ఏడు యుద్ధాలు ఆపిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఖాతాలో మరొకటి కలిపి 8 యుద్ధాలు ఆపిన శాంతిదూతగా అవతరించారు. భారత్‌-పాక్‌ యుద్ధం ఆపేసిన ట్రంప్‌ ఇప్పుడు పాకిస్తాన్‌-అఫ్ఘనిస్తాన్‌ యుద్ధం ఆపేశారు. ఈ యుద్ధం ఆపడం తనకు చాలా సులువైన పని ట్రంప్‌ అన్నారు.

అమెరికాని పాలించేందుకు తనను ప్రజలు ఎన్నుకున్నారు కనుక యుద్ధాలు ఆపడం తన డ్యూటీ కాదని, కానీ మానవాళిని రక్షించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ట్రంప్‌ చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 8 యుద్ధాలు ఆపి లక్షల మంది ప్రాణాలు కాపాడానని ట్రంప్‌ చెప్పారు. అయితే ఇన్ని యుద్ధాలు ఆపి, ఇన్ని లక్షల మందిని కాపాడుతున్నా తనకు నోబుల్ శాంతి బహుమతి లభించకపోవడం చాలా నిరాశ కలిగించిందని ట్రంప్‌ అన్నారు.

ADVERTISEMENT

కానీ పాకిస్థాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా (హమాస్), రష్యా వంటి దేశాలను ట్రంప్‌ నిజంగానే ఆపగలరా?అంటే కాదనే అందరికీ తెలుసు. ఇటువంటి దేశాలన్నీ తాత్కాలికంగా రాజీపడి వెనక్కు తగ్గినప్పటికీ ఏదో ఓ కారణంతో మళ్ళీ యుద్ధాలు మొదలుపెట్టకుండా ఉండవు. భారత్‌, అఫ్ఘనిస్తాన్‌ రెండు దేశాలతో ఏక కాలంలో యుద్ధాలు చేయగల శక్తి సామర్ధ్యాలు తమకున్నాయని ఇటీవలే పాక్‌ రక్షణ మంత్రి అనడమే ఇందుకు నిదర్శనం. ఈ మాటలు చేతల్లోకి మారడానికి పెద్ద కారణం అవసరం లేదు. తాజా ఉదాహరణగా అఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్‌ వాయుసేన దాడి కనిపిస్తోంది. ఈ దాడిలో ముగ్గురు అఫ్ఘన్ క్రికెటర్స్‌తో పాటు 8 మంది పౌరులు మృతి చెందారు.

పాకిస్తాన్‌ ఉగ్రవాదులను తయారుచేసే దేశమైతే, అఫ్ఘనిస్తాన్‌లో ఉన్నది మామూలు ప్రభుత్వం కాదు… కరడుగట్టిన ఉగ్రవాదుల తాలిబాన్ ప్రభుత్వం. కనుక అది కూడా తప్పకుండా ఎదురుదాడి చేస్తుంది.

కనుక ప్రపంచంలో ఎక్కడో అక్కడ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కనుక డోనాల్డ్ ట్రంప్‌కి చేతికీ, నోటికీ పనికి కరువుండదు. ఇలా యుద్ధాలు జరుగుతుంటే, వాటిని ట్రంప్‌ ఆపేస్తుంటే వచ్చే ఏడాది తప్పకుండా ఆయనకే నోబుల్ శాంతి బహుమతి లభిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories