“భరత్ అనే నేను” డిక్లేర్ చేసారు!

DOP Thiru for bharath ane nenuకొరటాల శివ – మహేష్ బాబు కాంబోలో రెండవ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న “భరత్ అనే నేను” సినిమా ఫస్ట్ లుక్ ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు గానీ, తాజాగా మరో అంశాన్ని మాత్రం ఖరారు చేసింది.

ADVERTISEMENT

గత కొన్ని రోజులుగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ విషయంలో ఓ పుకారు షికారు చేస్తోంది. అయితే అది పుకారు కాదు, నిజమే అంటూ మహేష్ టీం స్పష్టం చేసింది. “భరత్ అనే నేను” సినిమాకు ఫోటోగ్రఫీ అందించేందుకు రవి కే చంద్రన్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పేరులో మార్పు జరిగింది.

రవి గారికి ఇతర కమిట్మెంట్స్ ఉండడం వలన, నేటి నుండి ప్రారంభం కాబోయే మలి షెడ్యూల్ లో… ‘జనతా గ్యారేజ్’ ఫేం తిరు ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. ‘నిప్పు లేనిదే పొగ రాదుగా’ అన్నట్లు రవి కే చంద్రన్ విషయంలో హల్చల్ చేసిన పుకారు నిజమైంది

ADVERTISEMENT
Latest Stories