ప్రాణం ఖరీదు ఒక మద్యం బాటిల్.?

Drunk Driving Accidents Claim Innocent Lives Daily

ఈ మధ్యకాలంలో తరుచు మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త హృదయాలను కలచి వేస్తున్నాయి. కొంతమంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఆ మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి ఏ పాపం తెలియని అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

తాగుబోతుల నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని కన్నీటి శోకంలో నెడుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఆ కుటుంబాన్ని అనాధగాను మారుస్తుంది. మరి వారి ఆ కన్నీటి ఆవేదన ఖరీదు, ఆ నిండు ప్రాణం వేల కేవలం ఒక మద్యం బాటిల్ యేనా.? అనే ప్రశ్న బాధితుల గుండెలు పిండేస్తుంది.

ADVERTISEMENT

తాజాగా దాచేపల్లికి చెందిన షేక్ సైదా అనే వ్యక్తి మద్యం తాగి ఆ మత్తులో తన బొలెరో వాహనాన్ని నడుపుతూ పిడుగురాళ్లలో భీభత్సం సృష్టించాడు. అటుగా వస్తున్న టూ వీలర్ ను ఢీకొట్టడంతో స్కూటీ మీద ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

అయితే మద్యం మత్తులో బండి నడుపుతూ స్కూటీ ఢీకొట్టిన షేక్ సైదా ను స్థానికులు నిర్బంధించి ఆయనకు దేహ శుద్ధి చేసారు. ఇక్కడ ఒకడి నిర్లక్ష్యం, ఒకడి వ్యసనం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రెండు కుటుంబాలను ఆపదలో నెట్టింది.

ఇటువంటి కేసులు నానాటికి సమాజాన్ని విషాదంలోకి నెడుతున్నా ఇంకా ఈ మద్యం ప్రియుల మత్తువదలడం లేదు. వీరి వ్యసనం కారణంగా వారితో పాటుగా అటు వైపు ప్రయాణం చేసే సామాన్య ప్రజానీకానికి కూడా ప్రమాదమే అవుతుంది.

అతివేగం, మద్యం మత్తు ఇప్పటికే ఎన్నో ప్రాణాలను హరించినా, ఎన్నో కుటుంబాలలో తీరని శోకాలను మిగిల్చినా ఇంకా వారి రక్త దాహం తీరడం లేదు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, అధికారులు, సెలబ్రెటీలు ఈ రక్త పిశాచులను ఎంతగా చైతన్య పరిచినా, ఎంతగా బయపెట్టినా అయినా వారి రక్త దాహం తీరడం లేదు.

రోజుకో చోట, పూటకో కుటుంబాన్ని నడి రోడ్డుకు లాగుతూనే ఉంటున్నారు. ఈ జాడ్యం ఇంకెంతమంది ప్రాణాలను హరించాలి.? ఇటువంటి వారికి కఠిన శిక్షలు పడితేగాని ఈ మద్యం మత్తు చావులకు నివారణ దొరుకుతుంది. లేకుంటే ఒక నిండు ప్రాణం ఖరీదు ఒక మద్యం బాటిల్ తో సమానమైపోయే ప్రమాదం ఉంది.

ADVERTISEMENT
Latest Stories