‘ఫస్ట్ లుక్’ ముందు వరకు అస్సలు ఏ మాత్రం లీక్ కాకుండా జాగ్రత్తపడిన “దువ్వాడ జగన్నాధమ్” చిత్ర యూనిట్ కు షాక్ నిచ్చే విధంగా, వరుసగా ఫోటోలు, వీడియోలు లీక్ బారిన పడుతున్నాయి. ‘ఫస్ట్ లుక్’కు ముందు బ్రాహ్మణుని గెటప్ లో ఉన్న బన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో లీకై, హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ లుక్ విడుదల తర్వాత తాజాగా ఓ చిన్నపాటి వీడియో విడుదలై సందడి చేస్తోంది.
పంచెకట్టుతో ఉన్న అల్లు అర్జున్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియోలో బన్నీ డైలాగ్స్ పెద్దగా వినపడకపోయినా… బాగా కీన్ గా విన్న వారికి ‘ఆ మాటల్ని మీ బాబాయిలకు చెప్పానంటే తక్షణం మీ పెళ్లి ఆగిపోతుంది జాగ్రత్త’ అంటూ ఓ జంటకు బెదిరిస్తున్నట్లుగా ఉంది. ఫస్ట్ వీడియో ఇలా లీక్ కాగా, చిత్ర యూనిట్ నుండి అధికారికంగా మాత్రం శివరాత్రి రోజున ఫస్ట్ టీజర్ అభిమానులకు కనువిందు చేయనుంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



