పెద్ద నోట్ల ప్రభావంతో సినిమాలన్నీ వాయిదాలు పడుతున్న వేళ, యువహీరో నిఖిల్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అంటూ ధైర్యంగా ఎందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడో, ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఓ సింపుల్ కధకు సైన్సు అండ్ ఫిక్షన్ జోడిస్తే… ఎంత ఆసక్తికరంగా ఉంటుందో… ఈ సినిమా ట్రైలర్ అలా ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా చూద్దామా వద్దా? అన్న ఆలోచనలు చేసిన వారికి ‘చూడాలన్న’ పూర్తి స్పష్టత వచ్చేస్తుంది.
నటుడిగా నిఖిల్ ఒక్కో మెట్టు ఎదుగుతున్నట్లు కనపడుతోంది. నిఖిల్ ఇచ్చిన హావభావాలు ప్లస్ పాయింట్ గా పక్కన పెడితే, మొదటగా ఈ సినిమా ట్రైలర్ లో ఆకట్టుకునే అంశాలు ఫోటోగ్రఫీ మరియు అద్భుతమైన లొకేషన్స్. అలాగే శేఖర్ చంద్ర ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ‘కార్తీకేయ’ తరహాలోనే ఫస్ట్ లుక్ లోనే పడేసే విధంగా ట్రైలర్ ఉండడంతో, బహుశా మోడీ ఫియర్ నుండి బయటకు వచ్చి, ఫస్ట్ హిట్ కొట్టే సినిమాగా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.



