ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు: ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Election 2024 Andhra Pradesh Telangana

ఇదివరకు రెండు రాష్ట్రాలలో వేర్వేరు తేదీలలో ఎన్నికలు జరిగేవి కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ఒకేసారి మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి.

ఇదివరకు రెండు రాష్ట్రాలలో వేర్వేరు తేదీలలో ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణలో ముఖ్యంగా… హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రావాళ్ళలో చాలా మంది రెండు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంది కనుక వారు రెండు చోట్ల ఓట్లు వేసేవారు. ఓటర్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేయకపోవడం వలన నేటికీ వారందరికీ ఈ వెసులుబాటు ఉంది.

ADVERTISEMENT

కానీ ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజున పోలింగ్ జరుగుతుండటంతో వారికి రెండు చోట్ల ఓట్లు వేసే అవకాశం లేకుండాపోయింది. అటువంటి వారందరూ ఈసారి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో లేదా ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఒక్క రాష్ట్రంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకోగలుగుతారు.

దీని వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అని ఆలోచిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీ, వైసీపిలకు లాభం, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ, హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రావాళ్ళు తమ రాష్ట్రంతోనే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారని ప్రతీ సంక్రాంతి పండుగ స్పష్టం చేస్తుంటుంది. కనుక రెండుచోట్ల ఓటు హక్కున్నవారు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయడం కంటే ఈసారి ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓట్లు వేయడానికే ప్రాధాన్యం ఇస్తారు.

ముఖ్యంగా ఈసారి ఎన్నికలు ఇటు వైసీపికి అటు టిడిపి, జనసేనలకు చాలా కీలకంగా మారినందున, టిడిపి, జనసేన, వైసీపిలను అభిమానించేవారు తమకు నచ్చిన పార్టీలని గెలిపించుకునేందుకు ఏపీలోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం తధ్యం. కనుక రెండు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఏపీలో ఈ మూడు పార్టీలు లబ్ధి పొందుతాయి.

ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఏపీలో ఎటువంటి ఎన్నికలు లేవు. కనుక సెటిలర్స్ అందరూ హైదరాబాద్‌లోనే ఉండిపోయి బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు. ఈ కారణంగానే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

కానీ అదే సమయంలో హైదరాబాద్‌లో స్థిరపడ్డ తెలంగాణ వాసులందరూ తమ తమ జిల్లాలకు తరలిపోయి, కాంగ్రెస్‌, బిఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలకు ఓట్లు వేశారు. కనుక ఇతర జిల్లాలలో మూడు పార్టీలు ముఖ్యంగా … కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు లబ్ధి పొందాయి.

కానీ ఈసారి హైదరాబాద్‌లో సెటిలర్స్ అందరూ ఏపీలోనే తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది కనుక బిఆర్ఎస్ పార్టీ వారి ఓట్లు కోల్పోతుంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు లబ్ధి పొందే అవకాశం ఉంది

ADVERTISEMENT
Latest Stories