అమరావతిలో ‘హీరోయిన్, యాంకర్’ అంటూ హైటెక్ వ్యభిచారం?

escorts-call-girls-in-amaravati-prostitutionనవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలో పలువురు ధనవంతులు, బడాబాబుల సెల్ ఫోన్లకు కొత్తగా మెసేజ్ వస్తోందట. “సినిమా హీరోయిన్ కావాలా? ముంబై మోడల్ కావాలా? టీవీ యాంకర్ కావాలా? ఎవరైనా రెడీ. విందైనా, వినోదమైనా అమ్మాయిలున్నారు. మీరు ఎంచుకున్నాకే రేటు… అందమైన వారెందరో ఉన్నారు” అన్నది దాని సారాంశం.

రాజధానిగా ముస్తాబవుతున్న గుంటూరు, విజయవాడ మధ్య అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోవడం, ఎంతో మంది ధనవంతులు వచ్చి నివాసం ఉంటుండటంతో, ఎంపిక చేసుకున్న వారికి వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా, అమ్మాయిల ఫోటోలను పంపించి హైటెక్ సెక్స్ రాకెట్ కు తెరదీశారు. టెక్నాలజీని వారి దందాకు వాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సెల్ ఫోన్ సంభాషణ తాజాగా ఓ మీడియా ఛానల్ చేతికి చిక్కింది.

ADVERTISEMENT

దీనిలోని వివరాల ప్రకారం… ఫోటోను చూసి అమ్మాయి నచ్చితే వారు చెప్పిన అపార్ట్ మెంట్ కు వెళ్లాలి. అక్కడికి వెళ్లి చూస్తామంటే కుదరదు. మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి వంటి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి, వారు చెప్పిన అపార్ట్ మెంట్ కు వెళ్లి ఎంచుకున్న అమ్మాయితో ఒప్పందం ప్రకారం, గంటో, రెండు గంటలో గడపొచ్చు. ఒకవేళ అమ్మాయిని బయటకు తీసుకు వెళ్లాలన్నా పంపిస్తారు. అందుకు రేటు వేరే ఉంటుంది. గంటకు 10 వేల వరకూ చెల్లించాల్సి వుంటుంది. ఇలా ప్రసారమవుతున్న కధనాలు స్థానిక వాసుల్లో గుబులు రేపుతోంది.

ADVERTISEMENT
Latest Stories