జగన్‌ తప్ప వైసీపిలో అందరూ 175 సీట్ల భ్రమలోనే?

Jagan YCP Ministers

వైసీపికి ప్రధాన బలం, బలహీనత రెండూ కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డే. ప్రజలు ఆయన మొహం చూసే వైసీపికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆయన అనాలోచిత నిర్ణయాలను, వైఫల్యాలను చూసే ఈసారి వైసీపికి రెండో ఛాన్స్ నిరాకరించవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందుకే చాలా ఆందోళన చెందుతుంటారు.

మొదటిసారి ఆయన పాలన ఎలా ఉంటుందో ప్రజలు రుచి చూడలేదు కనుక ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పూర్తిగా రుచి చూసేశారు కనుక మరో ఛాన్స్ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందడం సహజం. బహుశః అందుకే వారి అధినేత జగన్‌ ఈసారి 175 సీట్లు మనమే గెలుస్తున్నామంటూ అందరికీ ఓ గ్రాఫిక్ పిక్చర్ చూపించడం మొదలుపెట్టారు.

ADVERTISEMENT

తెలంగాణను అంతగా అభివృద్ధి చేసిన కేసీఆర్‌ నేడు ఏటికి ఎదురీతుంటే, కనీసం ఒక్క ఫ్లైఓవర్‌ కూడా కట్టని తమ ప్రభుత్వానికి 175 సీట్లు ఎలా సాధ్యం?అని వారు ఆలోచించేలోగా ‘మన సంక్షేమ పధకాలే మనల్ని గెలిపిస్తాయి. వాటితో రాష్ట్రంలో 98% ప్రజలు సంతృప్తి చెందారని, కనుక వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మనవే’ అంటూ జగన్‌ వైసీపిలో అందరినీ ‘మాస్ హిప్నాటిజం’ చేసేశారు.

దీంతో వైసీపిలో అందరూ కూడా 175 సీట్లు మనవే అని గట్టిగా ఆత్మవంచన చేసుకొంటూ అదే భ్రమలోనే కొట్టుకుపోతున్నారు. వారికి వేరే గత్యంతరం, ప్రత్యామ్నాయం లేదు కూడా!

కానీ పార్టీలో అందరినీ హిప్నటైజ్ చేసిన జగన్‌ తాను మాత్రం ఆ ట్రాన్స్‌లోకి జారుకోకుండా జాగ్రత పడుతున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఎన్నికలలోగా టిడిపిని మూయించేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. “చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు… టిడిపి హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలవలేదంటూ” ప్రచారం చేస్తూ, అది నిజమని ప్రజలకు కూడా నమ్మకం కలిగించేందుకు ఆయనపై వరుసపెట్టి కేసులు నమోదు చేసి, జైలుకి పంపించి, కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారు. అలాగే విశాఖా రాజధాని పేరుతో సమాంతరంగా మరో రాజకీయ వ్యూహం నడిపిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక వైసీపిని నీట ముంచినా పాల ముంచినా జగన్మోహన్‌ రెడ్డికే ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories