సెన్సార్ బారిన పడింది… ఈ సినిమా రిలీజ్ అవ్వదు..!

Faisal Kapadi X Zone Film Banned By CBFC Under Prasoon Joshiబాలీవుడ్ లో సెక్స్ కంటెంట్ ఉన్న సినిమాల రూపకల్పనకు కొదవలేదన్న విషయం తెలిసిందే. అడల్ట్ కామెడీస్ నుండి హాలీవుడ్ మాదిరి నేరుగా శృంగార సన్నివేశాలను చూపించడానికి ఊవ్విళ్ళూరుతున్న బాలీవుడ్ సినీ జనాలకు, సీబీఎఫ్‌సీ చైర్మ‌న్ గా ప‌హ్లాజ్ నిహలానీ స్థానంలో ప్ర‌సూన్ జోషి నియామకం మాంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. సినీ రంగానికి చెందిన ప్ర‌సూన్ జోషి చైర్మ‌న్‌ గా ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి సినిమాలకైనా స‌ర్టిఫికెట్ జారీ చేస్తార‌నే ఓ ప్రచారం ఇటీవల పెద్ద స్థాయిలో జరిగింది.

ADVERTISEMENT

దీంతో పూర్తి సెక్స్ సన్నివేశాలతో రూపుదిద్దుకున్న “ఎక్స్ జోన్” సినిమా కూడా ఇండియాలో విడుదల అవుతుందని భావించారు. అయితే తనపై ఉన్న ప్రచారాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించారు. ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికేట్ జారీ చేయకుండా, ఏకంగా నిషేధం విధించారు. ఫైజ‌ల్ క‌పాడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన “ఎక్స్ జోన్‌” సినిమాలో పెద్ద‌ మొత్తంలో అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉండ‌టంతో ఈ సినిమాను నిషేధించిన‌ట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్‌తో `అశోక‌` చిత్రంలో న‌టించిన హృషితా భ‌ట్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది.

ADVERTISEMENT
Latest Stories