ఈ విషయంలో “మెగా బ్రదర్స్” నిర్ణయంపై ఉత్కంఠ!

pawan-kalyan-chiranjeevi-invitaion-to-gali-janardhan-reddy-daughters-marriageమంచి అనుబంధం గల సోదరులే అయినప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో పూర్తి వ్యత్యాసం ఇట్టే గమనించవచ్చు. ఆ భేదాభిప్రాయాలే ఈ ఇద్దరి మధ్య కొంత దూరాన్ని పెంచింది. ముఖ్యంగా ‘ప్రజాసేవ’ అనుకునే రాజకీయ రంగంలో చిరు ఆలోచనలకు అనుగుణంగా పవన్ వ్యక్తిత్వం ఉండకపోవడంతోనే… అప్పటినుండి ఈ ఇద్దరి మధ్య దూరం ప్రారంభమైనదని ట్రేడ్ వర్గాలు చెప్తుంటాయి. ఇదంతా బహిరంగంగా అందరికీ తెలిసిన విషయాలే.

మెగాస్టార్ ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడటానికి ఇష్టపడితే, కాస్త రిస్క్ అయినా పర్వాలేదు, తన వ్యక్తిత్వానికి అనుగుణంగానే పవన్ ముందుకు వెళ్తారన్నది సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ ఇద్దరి మెగా బ్రదర్స్ కు తాజాగా ఓ చిక్కు వచ్చి పడింది. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు, పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ‘బళ్ళారి’ బాబుగా పిలుచుకునే గాలి జనార్ధన్ రెడ్డితో..!

ADVERTISEMENT

అవును… తన కూతురు వివాహ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా గాలి జనార్ధన్ రెడ్డి స్వయంగా ఈ ఇద్దరు సోదరులకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం. రాజకీయంగా అయితే ఈ ముగ్గురు మూడు భిన్న ధృవాలలో ఉన్నారు. గాలి బిజెపి, చిరు కాంగ్రెస్, పవన్ జనసేన… ఇలా ముగ్గురి అభిప్రాయాలు వేరు అయినప్పటికీ, వివాహం వంటి వ్యక్తిగత వేడుకలకు రాజకీయాలు అతీతం అన్న విషయం తెలిసిందే. అయితే వచ్చిన చిక్కల్లా… గాలి జనార్ధన్ రెడ్డిపై ఉన్న అక్రమార్కపు, అవినీతి ఆరోపణలే!

అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అధికార బిజెపిని ఏకరువు పెడుతున్న తరుణంలో… కాంగ్రెస్ సభ్యుడిగా చిరు అడుగు పెడితే, బిజెపికి అవకాశం కల్పించిన వారవుతారు. దీంతో పార్టీ పరంగా కాంగ్రెస్ అధిష్టానం నుండి చిరుకు గ్రీన్ సిగ్నల్ లభించకపోవచ్చన్నది పొలిటికల్ టాక్. మరో వైపు పవన్ కళ్యాణ్ ప్రధాన అజెండాలలో ఒకటి ‘అవినీతి నిర్మూలన.’ మరి అలాంటి సిద్ధాంతాలను పెట్టుకుని, లక్షల కోట్లు వేనుకేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి ఇంట అడుగు పెడితే, భవిష్యత్తులో రాజకీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో… ఈ ‘మెగా బ్రదర్స్’ ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

సహజంగా రెండు విభిన్న ధృవాలుగా ఉండే చిరు – పవన్ ఆలోచనలు, గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో ఒకే తాటిపైకి వస్తాయా? ఇద్దరూ ఆ వేడుకకు హాజరు అవుతారా? లేక ఇద్దరూ గైర్హాజరు అవుతారా? అదే జరిగితే, ఇద్దరినీ ఒక్క తాటిపైకి తెచ్చిన ఘనత గాలి జనార్ధన్ రెడ్డిది అవుతుంది. ఎందుకంటే… చిన్న దీపావళి పండగ సెలబ్రేషన్ విషయంలోనే చిరు – పవన్ ల మధ్య ఉన్న వ్యత్యాసం ఫ్యామిలీ ఫోటోల సాక్షిగా వెలుగు చూసింది.

ADVERTISEMENT
Latest Stories