ఇటీవలే పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా నయీమ్ ఒక వ్యాపారిని బెదిరిస్తోన్న ఆడియో మీడియా చేతికి చిక్కింది. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారిని ఫోన్‌లో బెదిరించిన నయీమ్, కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. కోటి రూపాయలు ఇవ్వకపోతే వ్యాపారి కుటుంబ సభ్యులను చంపుతానంటూ నయీమ్ బెదిరించడం, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం వంటి ఉదంతాలతో నయీమ్ ‘దందా’ సాగిందిలా…
ఫోన్… రింగ్… రింగ్… రింగ్…
నయీం : అన్న నమస్తేనే
వ్యాపారి : హాలో నమస్తే
నయీం : ఏమన్నా అన్ని ఫోన్లు బంద్ చేసినవ్
వ్యాపారి : అన్న ఏం లేదు. కొంచెం హాస్పిటల్‌కి వెళ్లినా. వేరే ఉద్దేశం లేదు. మే 31 కల్లా డబ్బులు జమ చేస్తా.
నయీం : డబ్బులు ఏమైనవి అన్నా?
వ్యాపారి : డబ్బులు అరెంజ్ కాలేదు. మే 31లోపు అరెంజ్ చేపిస్తనే అన్న.
నయీం : నువ్వు ఇట్ల మాట మారిస్తే ఎట్ల అన్న?
వ్యాపారి : లేదన్నా. మాట ఇచ్చిన తర్వాత మాట మార్చే ముచ్చట లేదన్నా. నాకు పది రోజుల నుంచి హార్ట్ స్ట్రోక్ ఉండే. హాస్పిటల్‌కి పోయినా. పైసలు అరెంజ్ కాలేదు. మే 31లోపు డబ్బులు ఇచ్చేస్తా.
నయీం : సరే.. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను.
వ్యాపారి : అన్న నువ్వు అట్ల అనొద్దే.
నయీం : అన్న నీకు రెస్పెక్ట్ ఇచ్చినం. నువ్వు పెట్టుకోలేదు. నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెల్వదు. రికార్డు చేసుకుంటవో. నీవు రికార్డు చేసుకుంటే నా బొ..(రాయడానికి వీలు కాని మాట) కిందికి వస్తది. ఏం భయం కాదు. అయితే ఒక కేసు అయితది నా మీద. దాని కంటే ఎక్కువ కాదు.
వ్యాపారి : అన్న నీకు దండం పెడుతా.. కాళ్ళు మొక్కుతా. 31లోపు డబ్బులు అరెంజ్ చేస్తా. ఈ ఒక్కసారి నా మాట విను.
నయీం : నీవు నన్ను చంపిద్దామని ఏం ప్లాన్ చేస్తున్నావో.. నాకు అన్నీ తెలుసన్నా.
వ్యాపారి : అన్న ప్రామీస్ చేస్తున్నా. ఈ ఒక్కసారి నమ్ము
నయీం : నీవు నన్ను చంపిద్దామని చూస్తున్నావు కదా! నువ్వు చస్తావో.. నేను చస్తానో.. అది దేవుడికి తెలుసు.
వ్యాపారి : అన్న నేను అట్ల అంటలేను.
నయీం : నీవు ఏమన్నా ప్లాన్ చేసుకో. నీవు ఎక్కడెక్కడ పోతున్నావు. ఏం చేస్తున్నావు. నా పిల్లల మీదు నువ్వు ఏం హరాజ్‌మెంట్ చేపిస్తున్నావు. పీడీ యాక్ట్ పెట్టించినవ్, అన్నీ తెలుసు.. నీవు సీఎం వద్దనన్న కూర్చో. ఏమన్నా చేసుకో. నీకు దేవుడే గతి. నీ శక్తి సరిపోతే నీవు చేపియ్.. నా శక్తి సరిపోతే నేను చేపిస్తా.
వ్యాపారి : అన్న నేను అట్ట చేసేతోని కాదు. అన్న నీ మేసేజ్ రాగానే ఫోన్ చేసిన అన్న. అట్ట చేసేతోని అయితే ఫోన్ చేసేటోన్ని కాదు అన్న.
నయీం : మేసేజ్ రాంగానే ఫోన్ చేసిన అంటే.. నీ లెక్క ఇంతేనా? నీకు లెక్క లేదా? నీకు భయం లేదా?
వ్యాపారి : నీకు దండం పెడుతా అన్న. నన్ను అర్థం చేసుకో.
నయీం : అన్న వన్ మంత్ చెప్తున్నావు. ఆ రోజు ఏం చెప్పినవ్. నువ్వు ఇచ్చినా నేను తీసుకోను అన్నా. నేను చెప్తున్నా. తర్వాత నీకేమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పొద్దు. కేసు పెట్టుకో. ఏమన్నా చేసుకో.
వ్యాపారి : నేను అట్ల చేసేతోని అయితే ఇందకా రాను అన్న. అర్థం చేసుకో.
నయీం : అవునన్నా. మరీ కనీసం నువ్వు ఇట్ల మాట్లాడం.. నాకు ఎవ్వరన్నా ఫోన్ చేసి ఉంటరా. నువ్వు చేసినవ్ ధైర్యం. నీకు ఏమనాలి నేను.
వ్యాపారి : అన్న నేను హాస్పిటల్‌లో ఉన్నా. కావాలంటే నీవు ఎంక్వైరీ చేసుకో అన్న. వన్ మంత్‌లో అరెంజ్ చేస్త అన్న.
నయీం : నీవు వన్ మంత్‌లో ఇచ్చినా నేను తీసుకోను. నేను నీకు ఏం జరుగుతదని ముందే చెప్తున్నా. కాపాడుకోగలిగితే కాపాడుకో.
వ్యాపారి : అన్న నీకు దండం పెడుతా. వన్ మంత్ టైమివ్వు. కాళ్ళు మొక్కుతా.
నయీం : వన్ మంత్ టైమంటే నేను నీకు ఎట్ల కనిపిస్తున్న అన్నా.
వ్యాపారి : అన్న ఈ ఒక్కసారి నన్ను కాపాడు.
నయీం : నేను ఈ వన్‌మంత్‌లో చచ్చిపోతే డబ్బులు మిగిలిపోతయి అనుకుంటున్నావ్ కదా. అరేయ్ నేను సావన్ర.
వ్యాపారి : అన్న ప్రమాణం చేసి చెప్తున్నా. వన్ మంత్‌లో ఇస్తా.
నయీం : అన్న ఇట్ల చేస్తే బాగుండదు. నీ మీద నాకు డౌట్ ఉంది. నీకు నెల రోజులు టైమివ్వలేను. ఇవాళ సాయంత్రం వరకు సగం పేమేంట్ చేసుకో. పదిహేను రోజులు టైమిస్తా. మిగతా సగం పేమేంట్ చేసుకో.
వ్యాపారి : అన్న నీకు దండం పెడుతా. నీ కాళ్ళు మొక్కుతా. వన్ మంత్ టైమివ్వు.
నయీం : అన్న ఇవ్వలేను. ఒక్కటే చెప్తున్నా. ఇవాళ సగం పేమేంట్ చేసుకో. మిగతా సగం పదిహేను రోజుల్లో పేమేంట్ చేసుకో.
వ్యాపారి : అన్న డబ్బులు లేవు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా తెలుస్తలేదు. డైరెక్ట్ ఇవాళ ఫోన్‌లో మాట్లాడుతున్నా. ఏవరికి ఇవ్వాల్నో కూడా తెల్వదన్నా.
నయీం : ఎవరికి ఇవ్వాల్నో తెల్వదా? పాశమన్న వస్తడని చెప్పిన కదా. అన్నకు ఇవ్వాలని చెప్పిన కదా.
వ్యాపారి : అన్న ఎట్లన్న చేసి నెల రోజులు ఆపు అన్నా.
నయీం : అన్న నెల రోజులు ఆపలేను. అన్న పిచ్చి లేపకు.
వ్యాపారి : అన్న నీ కాళ్ళు మొక్కుతనే. దండం పెడుతనే. ఈ ఒక్కసారి నన్ను కాపాడే.
నయీం : నెల రోజులైతే కాపాడలేను అన్న.
వ్యాపారి : నా జీవితంలో ఇంత వరకు ఎవరిని ఇట్ల రిక్వెస్ట్ చేయలేదు. వన్ మంత్‌లో ఇస్త అన్న. పూలల్లో పెట్టి డబ్బులు ఇస్త. నువ్వు నాకు కాంటాక్ట్ అవుడే అదృష్టం. 31లోపు అరెంజ్ చేస్త.
నయీం : నీదే నడవల్నా. ఇగో విను. నీవు పదిహేను రోజుల టైమ్ తీసుకో.
వ్యాపారి : అన్న నీకు దండం పెడుతా. కాళ్ళు మొక్కుతా.
నయీం : నీవు ఫోన్ ఎందుకు లేపుతలేవు చెప్పు.
వ్యాపారి : అన్న వన్ మంత్‌లో ఇవ్వకపోతే మాట పోతది. దండం పెడుతా. వన్ మంత్ టైమివ్వు.
నయీం : సరే.. అయితే నువ్వు పది రూపాయాలు ఎక్కువ ఇయ్యాలే.
వ్యాపారి : అన్న అవన్నీ ఏం పెట్టకు. నా మాట విను. నీ కాళ్ళు మొక్కుతా
నయీం : మళ్లీ 31రోజు కాళ్ళు మొక్కుతావు.
వ్యాపారి : అన్న ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అరెంజ్ చేస్తా.
నయీం : 31లోపు అరెంజ్ చేయకపోతే నీకు నేను కాల్ చేయను. దాని తర్వాత ఏం చేయాల్నో చేసుకుంటా.
వ్యాపారి : 31లోపు డబ్బులు అరెంజ్ చేస్త.
నయీం : 31లోపట అంటే ఏంది. ఎప్పుడు నీకు చేయాలి.
వ్యాపారి : 31నాడు నీకు తెచ్చిస్తనే.
నయీం : అవునన్నా. 31నాడు ఎప్పుడు చేయాలి కాల్ నీకు.
వ్యాపారి : అరెంజ్‌మెంట్ చేస్తా. 31నాడు మీ మనుషులు పంపియ్ ఇచ్చేస్త.
నయీం : సరే. 31నాడు ఎక్కడ పంపియ్యాలి మనిషిని.
వ్యాపారి : భువనగిరికి
నయీం : భువనగిరి వద్దు. హైదరాబాద్‌ల ఇయ్యాలే.
వ్యాపారి : నీవు ఎక్కడ చెప్తే అక్కడ తెచ్చిస్త.
నయీం : అవును మరీ నీకు ఫోన్ ఎప్పుడు చెయ్యాలే.
వ్యాపారి : 31నాడు ఇస్త. నీవు నాకు మాట ఇచ్చినవ్ కదా.
నయీం : అవునన్న. 31నాడు చేయొద్దా మరీ.
వ్యాపారి : 31నాడు ఫోన్ చేయ్ అంటున్నా.
నయీం : అప్పుడు మళ్లీ ఫోన్‌లు బంద్ పెట్టుకుంటవా.
వ్యాపారి : ఫోన్ బంద్ ఏం పెట్టుకోను అన్నా. నేను హాస్పిటల్ ఉన్నా.
నయీం : సరే. నేను ఒక్క నెలల చచ్చిపోతే పైసలు మిగులుతాయ్ అనుకుంటున్నావేమో..శ్రీధర్ బాబు అన్న.. ఏవడెవడు కలిసి ఏం చేస్తున్నాడో కానీ.. నేను చెప్తున్న కదా అన్న. నువ్వు మంచిగ ఉంటేనేమో నేను మంచిగ ఉంటా. నీవు చెడ్డగ ఉంటే నేను చేసేది చేయాల్సి వస్తది.
వ్యాపారి : అన్న నీవు చెప్పిన తర్వాత శ్రీధర్ బాబు అన్నను కూడా కలవలేదు అన్న.
నయీం : సరే
వ్యాపారి : మంచిదన్నా.
నయీం : 31వ తారీఖు రోజు ఫోన్ చేస్తా
వ్యాపారి : సరే మంచిదన్నా.
నయీం : నేను చేయకుంటే.. పాశమన్న ఫోన్ చేస్తాడు. ఫోన్ ఆన్‌లో పెట్టుకో.
వ్యాపారి : సరే.
నయీం : ఉంట అన్న.
వ్యాపారి : థ్యాంక్స్ అన్న.



