రాజధాని అంశం గంటాకు పార్టీ మారడానికి ఉపయోగపడుతుందా?

ganta-srinivasa-rao-supports-ys-jagan-on-three-capitalsమాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఎపి రాజధాని కి అన్ని విధాలుగా అనువైనదని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారని, ఎంతో శాంతియుతంగా ఉంటుందని ఆయన అన్నారు.

విశాఖ అన్ని విదాలుగా అర్హమైన నగరమని , జిఎన్ రావు కమిటీ నివేదికను సమర్దిస్తున్నానని ఆయన అన్నారు.విశాఖ వాసిగా, ఇక్కడే అనేక పదవులు చేసిన వ్యక్తిగా తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తానని ఆయన చెప్పారు. పార్టీ అమరావతిపై ఒక నిర్ణయం తీసుకున్నా, తాను మాత్రం విశాఖను స్వాగతిస్తానని ఆయన చెప్పడం గమనార్హం.

ADVERTISEMENT

ఎన్నికల నాటి నుండీ గంటా తెలుగుదేశం పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ మారుతున్నట్టు అనేక వదంతులు వినిపిస్తున్నాయి. అయితే ఒకటి రెండు సందర్భాలలో ఆయన పార్టీ మారడం లేదని చెప్పినా, ఆయన వ్యహారశైలి అనుమానంగానే ఉంది.

శాసనసభా సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ఇప్పుడు ఈ రాజధాని వంక చూపించి ఆయన పార్టీ మారిపోతారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. గంటా వెళ్లడం అంటూ జరిగితే ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోతారని వదంతులు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories