షాకింగ్ : జెనీలియా భర్త రితేష్ ‘దొంగతనం’ వీడియో?

Riteish Deshmukh Caught on Cam Shopliftingటాలీవుడ్ హాసిని (జెనీలియా డిసౌజా) భర్త బాలీవుడ్‌ నటుడు రితేష్ దేశ్‌ ముఖ్‌ ‘ట్రూ బ్లూ’ షాపులో దుస్తులు దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. ముంబయిలోని ఓ షాపింగ్ మాల్ లోని ‘ట్రూ బ్లూ’ బ్రాండ్ బట్టల షాపులో కొన్ని దుస్తులను ట్రై చేసిన రితేష్ దేశ్ ముఖ్… మరికొన్ని టీషర్టులను పట్టుకుపోవడం సీసీ పుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తోంది.

అయితే ఇది నిజమా? కాదా? అన్న మీమాంసలో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. డినో మోరియా, మందిరా బేడీ వంటి సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయి, రితేష్ ఇలాంటి పని చేస్తాడని ఊహించలేక పోయామన్నారు. ఇంతకీ రితేష్ నిజంగానే దొంగతనం చేసారా? లేక రితేష్ తాజాగా నటించిన ‘హౌస్‌ ఫుల్‌ 3’ సినిమాలోనిలో సన్నివేశమా? లేక ‘ట్రూ బ్లూ’ బ్రాండ్‌ ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియోనా? అన్నది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT

సీసీ టీవీ కెమెరాలు ఉన్న విషయం తెలిసి కూడా స్పష్టంగా తన ముఖం కనబడేలా ఈ పని చేశాడంటే, ఇదంతా తమాషా యవ్వారమని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. అయితే ఒకవేళ నిజమే అనుకున్నా… ఆర్ధికంగా లోటు అంటే తెలియని కుటుంబం రితేష్ ది. ఇటు సినిమాలలోనూ, అటు రాజకీయాలలోనూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. మరి వాస్తవాన్ని ఎప్పుడూ బయటపెడతారో గానీ, రితేష్ కు ఓ రేంజ్ లో పబ్లిసిటీ జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories