‘గూగుల్’కు అడ్డంకిగా మారిన ‘జీహెచ్ఎంసీ’ ఎన్నికలు?

GHMC-bumper-offerహైదరాబాద్‌లో ‘గూగుల్’ సంస్థ సొంతంగా ఏర్పాటు చేయదలచిన నూతన క్యాంపస్ కు సంబంధించిన భూమి పూజ మరింత ఆలస్యం కానుందా? 2016 మార్చిలో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించి… వేసవి నాటికల్లా నిర్మాణ పనులు చేపట్టాలని సదరు ‘గూగుల్’ సంస్థ భావిస్తున్నట్లుగా ఇటీవల తెలిపింది. 2019 నాటికల్లా కార్యాలయాన్ని సిద్ధం చేస్తామని ఇటీవలే వెల్లడించింది. అయితే, దీనికి జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం కనపడుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 28వ తేదీన తెలంగాణా ప్రభుత్వం ఐటీ పాలసీని ప్రకటించనున్న నేపధ్యంలో… గూగుల్‌తో పాటు మరో 15 కంపెనీలతో చర్చలు జరుపుతోంది. అదే రోజు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కొత్త పాలసీలు ఆవిష్కరించే విధంగా ప్లాన్ చేసింది. అయితే ఈ లోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే కోడ్ అమలులోకి వస్తుందని అంటున్నారు అధికారులు. దీనిపై అధ్యయనం చేస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.

ఒకవేళ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే, మార్చిలో చేయదలచిన ‘గూగుల్’ కార్యాలయ భూమి పూజ మరింత ఆలస్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందోనన్న ఆసక్తి తెలంగాణా గట్టుపై నెలకొంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories