దుబ్బాక ఉపఎన్నికలో తెరాస కు షాక్ ఇచ్చిన బీజేపీ ఎలాగైనా బల్దియా పై కాషాయ జండా ఎగురేయ్యాలని ఆరాటపడింది. అందుకోసం సర్వశక్తులు ఒడ్డింది. పెద్ద పెద్ద నేతలను సైతం మునిసిపల్ ఎన్నికలే కదా అనుకోకుండా ప్రచారానికి దింపింది. వారి కష్టానికి తగ్గట్టుగానే ఈరోజు ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలుకాగానే బీజేపీ ఇరగదీసింది.
దాదాపుగా 90-100 సీట్లలో ఆ పార్టీ ఆధిక్యత కనబరిచింది. దీనితో ఆ పార్టీ సమర్ధకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెలంగాణ అభిమానులు సంగతి అటుంచితే మొత్తం బీజేపీ ఐటీ సెల్ ఆక్టివ్ అయిపోయి తొడలు కొట్టేశారు దక్షిణాదిన మరో రాష్ట్రం పాగా వేసేశాం… కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటూ.
అయితే ఆ ఆనందం మూడు గంటల పాటు కూడా నిలవలేదు. మొదటి రౌండ్ ఫలితం రావడంతోనే తెరాస ముందుకు వచ్చింది. రౌండ్ కు రౌండ్ కు ఫలితం మారుతుంది అనుకున్నా పెద్దగా తేడా రాలేదు. పేపర్ బ్యాలెట్ కావడంతో కౌంటింగ్ ఆలస్యం అయ్యింది. అయితే ఈ ఎన్నికలలో బీజేపీ మెరుగైన ఫలితం రాబట్టుకుంది అనే చెప్పుకోవాలి.
సీట్లు పెంచుకోవడంతో పాటు ఓటు షేర్ ని కూడా గణనీయంగా పెంచుకుంది. సరైన అభ్యర్థులను నిలపడం… ప్రజా సమస్యల మీద సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోవడం… పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చెయ్యకపోవడం వంటి కారణాలతో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. అయితే కష్టపడితే వచ్చే ఎన్నికలలో మరింత మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు.





