‘బ్రెస్ట్ ఫీడింగ్’ జోసెఫ్ ఆవేదన!

Gilu Joseph Breast Feedingమలయాళ మ్యాగ్ జైన్ ‘గృహలక్ష్మి’ కవర్ పేజిపై బిడ్డకు పాలిస్తూ గిలు జోసెఫ్ ఇచ్చిన స్టిల్స్ పై చెలరేగిన దుమారం తెలిసిందే. పెళ్లి కాని జోసెఫ్ ఇలాంటి ఫోటోషూట్ లు చేయడమేంటి? అంటూ మండిపడిన వారు కొందరైతే, ఇదంతా పబ్లిసిటీలో భాగమని మరికొందరు ఆరోపించారు. ఇంకొందరైతే ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు కూడా నమోదు చేసారు. దీంతో సదరు ఫోటోషూట్ పై గిలు జోసెఫ్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

ADVERTISEMENT

సదరు ఫోటోషూట్ చేసిందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసిన జోసెఫ్, అది పబ్లిసిటీ స్టంట్ కాదని కొట్టిపారేసింది. గ్రాఫిక్ ఫోటోలను చూడడానికి ఇష్టపడుతున్న వారికి, ఓ బిడ్డకు పాలిస్తూ ఇచ్చిన ఫోటోను చూసి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిన్నటివరకు తనను గొప్ప కవిగా అభివర్ణించిన వారే నేడు విమర్శలకు దిగడం అనేది సరైన పద్ధతి కాదని జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేసారు.

ADVERTISEMENT
Latest Stories