ట్రైలర్ టాక్ – నగ్నత్వం అణువణువూ ఒక పెయింటింగ్!

“గాడ్, సెక్స్, ట్రూత్” పేరుతో మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్ తో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాలో మాల్కొవాకు సంబంధించిన పోస్ట్ చేసిన న్యూడ్ ఫోటోలతో కావల్సినంత పబ్లిసిటీ చేసిన వర్మ, యూ ట్యూబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ ట్రైలర్ ను కట్ చేసి విడుదల చేసారు. అంతేకాదు ఈ సినిమాను తెరకెక్కించడం వెనుక ఉన్న తన ఆంతర్యం ఏమిటో కూడా సవివరంగా తెలిపారు.

ADVERTISEMENT

జనవరి 26వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ సినిమా ఫుల్ వీడియోను విడుదల చేయనున్నామని స్పష్టం చేసిన వర్మ, అది యూ ట్యూబ్ లో కాకుండా మరో వెబ్ సైట్ లో విడుదల చేస్తున్నామని చెప్పడంతో, మియా మాల్కోవా ఫుల్ న్యూడ్ వీడియోను రిలీజ్ చేయనున్నారన్న విషయం స్పష్టమైంది. ఈ విషయాన్ని స్వయంగా వర్మ కూడా తెలిపారు. మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని ఆణువణువూని నా కెమెరాతో ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దానని స్వయంగా వర్మ పేర్కొన్నారు.

సమాజంలో సెక్స్ పట్ల ఉన్న అవగాహనను, అలాగే సెక్స్ పై మియాకు ఉన్న భావాలను ఇందులో పొందుపరిచానని, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మియాకు సెల్యూట్ చేస్తారని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్న వర్మ, మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ పట్ల అర్ధమే మారిపోతుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం… యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ ను బట్టి, నిజంగానే మియా అందాలను వర్మ ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దారని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories