‘గోల్డెన్ బే రిసార్ట్’ బిల్లుకు దారేది?

Golden Bay Resorts Billగత కొన్ని రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ వేదికగా జరిగిన రాజకీయం అందరికీ తెలిసిందే. తన వర్గీయులను గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంచి, శశికళ సకల సౌకర్యాలు కల్పించిన సంగతులు అలా ఉంటే, ఆ తర్వాత బయటకు వచ్చిన ఎమ్మెల్యేలకు దాదాపుగా 60 లక్షల రూపాయల బిల్లును చేతిలో పెట్టగా, వారు కేవలం 5 లక్షల రూపాయలను మాత్రమే చెల్లించారని తెలుస్తోంది. ఫిబ్రవరి 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు దాదాపుగా 120 ఎమ్మెల్యేలకు మరియు బౌన్సర్లకు గానూ ఈ మొత్తం అయ్యిందని సమాచారం.

ఈ ఎమ్మెల్యేలు మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత ఏకంగా రిసార్ట్ మూసివేసి, మరమ్మత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తగా, ఇపుడు మిగిలిన 55 లక్షల రూపాయలు ఎవరు చెల్లిస్తారో తెలియక, సదరు రిసార్ట్ యాజమాన్యం తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది. శశికళ జైలుకు వెళ్ళిపోగా, పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఈ బిల్లును సిఎంకు పంపే సాహాసం చేయకపోవచ్చు గానీ, వారి అనుచర వర్గానికి అయినా తెలియజేయాలో లేదో అన్న మీమాంసలో రిసార్ట్ యాజమాన్యం తలమునకలై ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories