ఏపీకి ప్రతికూల పరిస్థితులు అయినా ఏపీకే గూగుల్!

CM Chandrababu Naidu and Nara Lokesh secure Google AI Hub for Andhra Pradesh

గూగుల్ కంపెనీ ఏపీకి వస్తే ఏం గొప్ప? ఏం ఉపయోగం? అని వైసీపీ, దాని సొంత మీడియా ఎద్దేవా చేస్తుంటే, గూగుల్ వంటి ప్రఖ్యాత కంపెనీని చేజార్చుకున్నందుకు తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు యుద్ధం చేసుకుంటున్నాయి.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమిళనాడుకి చెందినవారు. ఆయన అమెరికా వెలుపల తొలిసారిగా భారత్‌లో రూ.87,000 కోట్ల పెట్టుబడితో తమ గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు చేస్తుంటే, దానిని తమిళనాడుకి సాధించడంలో సిఎం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకె ప్రభుత్వం విఫలమైంది.

ADVERTISEMENT

తమిళనాడుకి రావాల్సిన గూగుల్ కంపెనీని ఏపీకి వదిలేసి డీఎంకె ప్రభుత్వం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించింది. అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకె నేత అరుణ్ కుమార్‌ విమర్శించారు.

ఆయన విమర్శలపై అధికార డీఎంకె పార్టీ కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ “మీ పార్టీ బీజేపితో పొత్తు పెట్టుకునే ఉంది కదా?కేంద్రంపై ఒత్తిడి చేసి గూగుల్ తమిళనాడుకు వచ్చేలా చేయోచ్చు కదా?మీరు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన్న రాష్ట్రం పట్ల మీకు బాధ్యత ఉండదా?

అయినా గూగుల్ విషయంలో మా ప్రభుత్వ ప్రయత్నలోపమేమీ లేదు. మా ప్రభుత్వం ఇదివరకు అనేక భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలను తమిళనాడుకు తీసుకువచ్చిందనే సంగతి అన్నాడీఎంకే గుర్తుంచుకుంటే మంచిది,” అని డీఎంకే నేతలు విమర్శించారు.

ఈ విమర్శలకు అన్నాడీఎంకే నేతలు మళ్ళీ అంతే ఘాటుగా బదులిస్తూ, “ఏపీలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఉంది. అదే… తమిళనాడులో కూడా అన్నాడీఎంకె-బీజేపి ప్రభుత్వం ఉండి ఉంటే గూగుల్ కంపెనీ ఖచ్చితంగా రాష్ట్రానికే వచ్చేది. కనుక తమిళనాడులో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం ఎంత అవసరమో రాష్ట్ర ప్రజలు గమనించాలి,” అని అన్నారు.

అంతకు ముందు కర్ణాటక ఐటి శాఖా మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, “గూగుల్ కంపెనీని దక్కించుకోవడం కోసం ఏపీ ప్రభుత్వం చాలా భారీగా రాయితీలు ఇచ్చింది. అంత రాయితీలు ఇస్తే రాష్ట్రం నష్టపోతుంది. అందరూ మా ప్రభుత్వాన్ని నిలదీస్తారు కూడా. అయినా ఐటి కంపెనీలు రప్పించడానికి మేము ఎటువంటి రాయితీలు ఈయవలసిన అవసరం లేదు,” అని అన్నారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో గూగుల్ కంపెనీపై జరుగుతున్న ఈ యుద్ధాలు, ఈ మాటలు విన్నట్లయితే గూగుల్ కంపెనీని దక్కించుకోవడం ఎంత కష్టమో… ఎంత గొప్ప విషయమో అర్ధమవుతుంది.

దాని విలువ సిఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్‌కి బాగా తెలుసు. కనుకనే అన్ని రాష్ట్రాలతో పోటీ పడి సాధించుకొచ్చారు.

గూగుల్ కోసం పోటీ పడిన చాలా రాష్ట్రాలు ఆర్ధికంగా, పారిశ్రామికంగా, ఐటి రంగంలోనూ ఏపీ కంటే చాలా ముందున్నాయి. కానీ ఏపీకి ప్రతికూల అంశాలే ఎక్కువ. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు గడిచినా రాజధాని లేదు. పదేళ్ళ వ్యవధిలోనే రెండు ప్రభుత్వాలు మారాయి. గత 5 ఏళ్ళలో ఏపీ పరిస్థితిని చూసినవారు, ‘మళ్ళీ మేమే వస్తాం… మీ అందరి అంతు చూస్తామని’ వైసీపీ బెదిరింపులు వింటున్నవారు ఎవరూ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సాహసించరు.

కానీ ఇంత తీవ్రమైన పోటీ, ఇంత ప్రతికూల పరిస్థితిలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు గూగుల్‌ని ఏపీకి సాధించి తెచ్చారు. ఆయన ఇమేజ్, ఆయనపై నమ్మకంతోనే గూగుల్ ఏపీకి వస్తోందని వేరే చెప్పక్కర లేదు.

ADVERTISEMENT
Latest Stories