తమిళంలో ఇటీవల విడుదలై ప్రజాధరణ పొందిన “గులేబఘవాలి” సినిమాను తెలుగులో ‘గులేబకావళి’ పేరుతో డబ్బింగ్ చేస్తూ త్వరలో విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఓ నిధి కోసం సాగించే అన్వేషణను క్రైమ్ అండ్ కామెడీ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
ADVERTISEMENT
ప్రధాన పాత్రలో ప్రభుదేవా డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తున్నాడన్న సంకేతాలు ట్రైలర్ ఇవ్వగా, ఆయనకు జోడిగా హాట్ బ్యూటీ హన్సిక అందాల విందు చేయనుంది. రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్ట్ లా కనపడుతోన్న ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు గానీ, చాలాకాలం తర్వాత ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించడం విశేషం. మరి తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
ADVERTISEMENT



