డైరెక్టుగా ఆన్ లైన్ కు రానున్న శ్రీదేవి కూతురి సినిమా

Gunjan Saxena On Netflixకరోనా కాలంలో చిత్ర పరిశ్రమ భవిష్యత్తు పై అనిశ్చితి కొనసాగుతుంది. బాగా తొందరగా ఓపెన్ అవుతాయి అని లెక్కేసినా ఆగస్టు ముందు థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. అనేక మంది చిత్రనిర్మాతలు పూర్తయిన తమ సినిమాలను విడుదల చెయ్యలేక, వడ్డీలు పెరుగుతుండడంతో చాలా కష్టపడుతున్నారు. అందువల్ల వారు డైరెక్టు ఆన్‌లైన్ విడుదలలను ఎంచుకుంటున్నారు.

బాలీవుడ్ యొక్క మొట్టమొదటి ఆన్‌లైన్ విడుదల గులాబో సీతాబో ఈ నెల 12 న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలవుతోంది. ఇప్పుడు మరో చిత్రం గుంజన్ సక్సేనా కూడా ఆన్‌లైన్‌లో విడుదలవుతోంది. శ్రీదేవి కుమార్తె జాహ్న్వి కపూర్ నటించిన ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

ADVERTISEMENT

గుంజన్ సక్సేనా భారత వైమానిక దళ పైలట్ గుంజన్ సక్సేనా జీవితంపై బయోపిక్. ఆమె శ్రీవిద్య రాజన్ తో కలిసి యుద్ధ ప్రాంతంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా ఫైటర్ పైలట్ అయ్యారు. గుంజన్ 1999 లో కార్గిల్ యుద్ధంలో సైనికులను రక్షించారు. యుద్ధ సమయంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించినందుకు శౌర్య వీర్ అవార్డుతో సత్కరించారు.

ఈ సినిమా ను ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. 2018లో దఢక్ అనే సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ రెండో సినిమా గుంజన్ సక్సేనా. ఆమె మరో సినిమా రూహి ఆఫ్జానా కూడా డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదలకు సన్నాహాలు చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి..

Confused & Not Sure What to Watch on Amazon Prime, Netflix? Click Here

ADVERTISEMENT
Latest Stories