ఏపీలో పాలన అక్కడే ఆగిపోయిందా?

Guntur-AT-Agraharam-Name-Changed-To-Fathima-Nagarఅనేక రాష్ట్రాలలో బొటాబోటి మెజార్టీతో లేదా ఇతర పార్టీల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయో తెలీని పరిస్థితి కనిపిస్తుంటుంది. ఆ పరిస్థితులలో అధికార పార్టీ కాళ్ళుచేతులు కట్టేసుకొని పరిపాలన చేయవలసి ఉంటుంది. కనుక ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇమ్మనమని అడిగితే ఏపీ ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. కనుక తెలంగాణ ప్రభుత్వంలాగ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధిపధంలో పరుగులు పెట్టించి ఉండవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే అభివృద్ధికి బ్రేకులు వేసి, సంక్షేమ పధకాలను హైస్పీడులో కొనసాగిస్తున్నారు. అభివృద్ధి అంటే ఇదేనని కనుక ఇదే మా విదానమని వైసీపీ నేతలు వాటిని సమర్ధించుకోవచ్చు. దాని మంచిచెడ్డల గురించి ప్రజలందరికీ తెలుసు కనుక వాటి పర్యవసానలు, రాజకీయ ప్రయోజనాల గురించి ఇప్పుడు చర్చ అనవసరం.

మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రజలను మెప్పించేందుకు రాష్ట్రాభివృద్ధికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం అటువంటి ఆలోచనలు ఏమీ చేయకపోగా, రివర్స్ టెండరింగ్ పేరిట యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులన్నీ ఎక్కడివక్కడ నిలిపివేయించింది. పైగా గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందంటూ రాజకీయ కక్షసాధింపులకు ప్రయత్నిస్తోంది.

ADVERTISEMENT

కూల్చివేతలు, ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు, మీడియా, సోషల్ మీడియాలో మంత్రుల తిట్లు, బూతులు వంటివన్నీ రోజువారీ వార్తాలుగా మారిపోయాయి. అభివృద్ధి గురించి ఆలోచించవలసిన తరుణంలో 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భవనాలకు, ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మలకు వైసీపీ రంగులు వేయించింది. సంస్థలు, జిల్లాలు, వీధుల పేర్లు, చివరికి వైజాగ్‌ బీచ్‌ ఒడ్డున వ్యూ పాయింట్‌కు పేర్లు మార్చి ఎవరినో ఓడించిన్నట్లు ఆనందిస్తోంది.

తాజాగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నగరంలోని ఆనంద త్రిదండి అగ్రహారం (ఏటీ అగ్రహారం) పేరు మార్చి ఫాతిమా నగర్‌ అనే బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే దానిని తొలగించి అదే బోర్డుపై ఏటీ అగ్రహారం అని వ్రాసుకొన్నారు. ఇటువంటి చిల్లర పనులను చూస్తుంటే రాష్ట్రంలో వైసీపీ పాలన ఇక్కడే ఆగిపోయిందా?అని అనిపించకమానదు. రాష్ట్రాభివృద్ధి చేయకపోగా ప్రభుత్వమే ఈవిదంగా ప్రజల మద్య ప్రాంతీయ, కులమత విద్వేషాలు రగిలిస్తుండటం చాలా బాధాకరం. దురదృష్టకరమే. ఏటీ అగ్రహారం పేరు మార్చడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు, సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT
Latest Stories